యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన ముద్దుగుమ్మలు నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు పాటలు ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను సంపాదించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని ‘ఉండిపో’ అనే పల్లవితో సాగే మణిశర్మ సంగీత సారథ్యంలోని మెలోడీ గీతాన్ని రేపు ఉదయం 11 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనుంది చిత్ర బృదం.
ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి మాస్, కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న తమ చిత్రం, రేపు విడుదల తరువాత తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది . పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి మరియు ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


