సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రలహరి చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అదే ఊపుతో అయన చేస్తున్న నూతన చిత్రం ‘ప్రతిరోజు పండగే’. రొమాంటిక్ కథలను, కామెడీ పంథాలో తెరకెక్కించే దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభం అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ తన అనుభవాలు అభిమానులతో పంచుకున్నారు. ‘చాలారోజుల తరువాత తొలిరోజు తమ చిత్రం షూటింగ్లో పాల్గొన్న అనుభవం చాలా బాగుందని తేజ్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక మేకింగ్ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది.
యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ, ప్రమోద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో ఎంటర్టైన్మెంట్ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో తేజ్ పాత్ర అందరిని ఆకట్టుకుంటుందని అంటోంది చిత్ర యూనిట్. ఇకపోతే తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయకుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జైకుమార్ వసంత్, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు….!!


