ప్రస్తుతం బుల్లితెరపై మంచి క్రేజ్ మరియు రేటింగ్స్ తో దూసుకెళ్తున్న షోల్లో, స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్’ షో కూడా ఒకటి. ఈ షో మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలానే రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించడం జరిగింది. ఈ రెండు సీజన్లు వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడంతో మూడవ సీజన్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సీజన్ కు హోస్ట్ గా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నట్లు కాసేపటి క్రితం స్టార్ మా ఛానల్ యాజమాన్యం వారు ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. నాగార్జున రాకతో ఈ సీజన్ మరింత ఉత్సాహవంతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు . అయితే ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఇక ఇందులో ఎవరెవరు పార్టిసిపెంట్స్ గా వ్యవహరించనున్నారు వంటి తదితర విషయాలన్నీ అతి త్వరలో వెల్లడి కానున్నాయి.


