టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త చిత్రం బుర్రకథ. మాటల రచయితగా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించిన డైమండ్ రత్నబాబు తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల మన్ననలు సంపాదించింది. ఇక చిత్రంలో హీరోకు రెండు మెదళ్ళు ఉండడం అనే ఒక సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయాలని నిర్ణయించారు.
అయితే సెన్సార్ కారణాల వల్ల చిత్రాన్ని 28 న విడుదల చేయలేకపోతున్నామని కొత్త డేట్ ని త్వరలో ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది . ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఆది సరసన నైరా షా, మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు….!!