హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో కోటి రూపాయలు వసూలు చేసిన సూపర్ స్టార్ మహేష్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘మహర్షి’

0
449

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా ఇటీవల విడుదలైన అయన 25వ చిత్రం మహర్షి, ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇక ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అతి పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం, సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో ఒక పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఇప్పటికే దాదాపుగా 50 రోజులు పూర్తి కావస్తున్న ఈ చిత్రం, మహేష్ బాబు అడ్డాగా పేరుగాంచిన, హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో 48 రోజులకు గాను రూ.1కోటి గ్రాస్ కలెక్షన్లు అందుకుని అద్భుత రికార్డుని నెలకొల్పింది.

ఇదే థియేటర్లో మహర్షి తో కలిపి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గత ఐదు చిత్రాలు రూ.1 కోటికిపైగా గ్రాస్ ని కలెక్ట్ చేయడం విశేషం. ఇక రేపటితో విజయవంతంగా 210 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోనున్న ఈ చిత్ర అర్ధ శతదినోత్సవ వేడుకను చిత్ర బృందం, 28 న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో వైభవంగా నిర్వహించనుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here