‘డీజే’ సినిమా సక్సెస్ఫుల్ జర్నీకి రెండేళ్లు : దర్శకులు హరీష్ శంకర్

0
129

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్, ఆ తరువాత మరొక మెగాహీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తీసిన హిట్ మూవీ డీజే. విడుదలైన తొలిరోజు నుండి మంచి మాస్ కమర్షియల్ సినిమాగా డీజే సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతూ మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం విడుదలై నేటికి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా దర్శకులు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఒక పోస్ట్ చేసారు.

ముందుగా మా డీజే సినిమా హీరో అల్లు అర్జున్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఈ సినిమా మా ఇద్దరికీ కెరీర్ పరంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారికి, అలానే అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన అయనాంక బోస్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పుతూ, డిజె సినిమా సక్సెస్ మీట్ ఫోటోలను అయన షేర్ చేసారు. కాగా హరీష్ శంకర్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here