ఈ నెల 25న ‘బ్రోచేవారెవరురా’ ప్రీ రిలీజ్ వేడుక….!!

0
79

శ్రీ విష్ణు, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్న చిత్రం బ్రోచేవారెవరురా. వైవిధ్యమైన కథ మరియు కథనాలతో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టింది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 25న హైదరాబాద్ లోని హైటెక్స్ రోడ్ లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో అతిథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ఈ చిత్రంలో నివేత థామస్, నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ‌ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఎంతో ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరాం, ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌. కాగా చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here