రేపు ‘దొరసాని’ చిత్రం రెండవ పాట విడుదల…. !!

0
59

నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం దొరసాని. ఇక ఈ చిత్రం ద్వారా నటులు రాజశేఖర్, జీవితల చిన్న తనయ శివాత్మిక కూడా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. 80వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ‘దొరసాని’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది చిత్ర బృందం. ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అలానే ఈ చిత్రంలోని ‘నింగిలోని పాలపుంత’ అనే పల్లవితో సాగె పాటను ఇటీవల చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.

ఇక ఇప్పటికే చిత్రంలోని రెండవ పాట ‘కళ్ళలో కలవరమై’ ప్రోమోను కూడా విడుదల చేసిన చిత్ర బృందం, రేపు ఉదయం 10 గంటలకు ఆ పూర్తి పాటను యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేష్ బాబు, సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి, ఎడిటర్ : నవీన్ నూలి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, ఆర్ట్ డైరెక్టర్ : జె.కె మూర్తి, పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని, నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని, రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని జూలై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here