ప్రస్తుతం విభిన్నమైన తరహా చిత్రాల్లో నటించే హీరోల్లో యువ హీరో నితిన్ కూడా ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం వెంకి కుడుములు దర్శకత్వంలో భీష్మ పేరుతో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్నటినుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్ర షూటింగ్ నేడు పూర్తి కాగానే ఇంటికి బయల్దేరిన నితిన్, రోడ్ పై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కారణంగా మెట్రో ట్రైన్ లో ప్రయాణించి, అందులోని ప్రయాణీకులతో కాసేపు సరదాగా గడిపి వారితో సెల్ఫీలు కూడా దిగారు.
అంతేకాక మెట్రోలో తాను చేసిన ప్రయాణం చాలా బాగుందని, ఈ విషయాన్ని అయన కాసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. కాగా నితిన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!!


