ఆది ‘బుర్రకథ’కు బెస్ట్ విషెస్ చెప్పిన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్…!

0
535

ఆది సాయికుమార్ హీరోగా మాటల రచయితగా అనేక విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన డైమండ్ రత్నబాబు, తొలిసారిగా మెగాఫోన్ పడుతున్న చిత్రం బుర్రకథ. హీరోకు రెండు మెదళ్ళు కలిగి ఉండడం అనే వినూత్న కథాంశంతో రూపొందుతూ దీపాల ఆర్ట్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో ఆది సరసన నైరా షా, మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటిస్తున్నారు. పూర్తి స్దాయి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించగా హెచ్‌.కె.శ్రీకాంత్‌ దీపాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అతి త్వరలో సాయి కార్తీక్‌ సంగీతసారథ్యంలోని పాటలను విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇక ఈ చిత్రం మంచి విజయవంతం అయి, దర్శకుడు రత్నబాబు గారికి అలానే హీరో ఆదికి కెరీర్ పరంగా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నట్లు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కాసేపటిక్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ తెలిపారు. తేజ్ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here