సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టి, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుని విజయవంతంగా ఏడవవారంలోకి అడుగుపెట్టిన మహర్షి, ఇంకా కొన్ని ఏరియాల్లో స్టడీగానే ముందుకు సాగుతోంది.
ఇకపోతే మహర్షి సూపర్ సక్సెస్ కు ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు కూడా కొంత కారణం అనే చెప్పాలి. ఇప్పటివరకు రెండు సాంగ్స్ మేకింగ్ వీడియోలను విడుదల చేసిన చిత్ర బృందం, కాసేపటి క్రితం ఈ చిత్రంలోని ‘ఎవరెస్టు అంచున’ అనే పల్లవితో సాగే సాంగ్ మేకింగ్ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేసింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది….!!


