శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం జైసేన. ప్రముఖ దర్శకుడు వి సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఇకపోతే రేపు సాయంత్రం 4 గంటలకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను యంగ్ యాక్షన్ హీరో గోపీచంద్ చేతులమీదుగా విడుదల చేయనున్నట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ రాజకీయ ఆశయాలకు సంబంధించినదైతే, తమ సినిమా ‘జై సేన’ ఆయన భావాలకు సంబంధించినదని అంటోంది చిత్ర బృదం.
నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలతో పాటు ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుందని, ఇక తన గత చిత్రాల వలె ఈ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకం ఉందంటున్నారు దర్శకుడు సముద్ర. వి విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి. సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం….!!


