‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ను మెచ్చిన డైరెక్టర్ సుకుమార్….!!

0
123

టాలీవుడ్ లో ఇటీవల కొత్త తరహా చిత్రాల రాక పెరగడమే కాక, ప్రేక్షకులు కూడా అటువంటి విభిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇక ఆ విధంగా నేడు డిటెక్టీవ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నేడు విడుదలైన మొదటి షోతో ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టిన ఈ సినిమాపై వెరైటీ చిత్రాల దర్శకులు సుకుమార్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశంశల జల్లు కురిపించారు.

ఈ చిత్రం ఒక కొత్త తరహా కథతో సాగే ఆసక్తికర చిత్రం అని, అద్బుతమైన కథ, ఆర్టిస్టుల నటన, అద్భుతమైన ఫోటోగ్రఫీ, అలానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు స్వరూప్  దర్శకత్వ ప్రతిభతో సినిమా ఆద్యంతం అద్భుతంగా నడిచిందని అన్నారు. ఇక నటుడు నవీన్ పోలిశెట్టి తన పాత్రలో జీవించారని, తన తరపున ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టీమ్ కు శుభాభినందనలు తెలియచేస్తున్నట్లు పోస్ట్ చేసారు సుకుమార్….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here