యూనివర్సల్‌ సబ్జెక్ట్‌తో ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు అందరినీ అలరిస్తుంది – హీరో చేతన్‌ మద్దినేని

0
123

చేతన్‌ మద్దినేని, కౌశిక్‌ ఓరా జంటగా నరేష్‌కుమార్‌ దర్శకత్వంలో డాల్ఫిన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై మంజునాధ్‌ వి. కందుకూర్‌ నిర్మిస్తున్న చిత్రం ” ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు”.. విద్య 100% బుద్ధి 0% అనేది ఉపశీర్షిక.. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కు సోషల్‌ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా హీరో చేతన్‌మద్దినేని ఇంటర్వ్యూ.

ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు సినిమా గురించి చెప్పండి?
– ఈ సినిమా బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్‌ర్యాంక్‌రాజు అనే వ్యక్తి యొక్క లైఫ్‌ జర్నీ అని చెప్పవచ్చు. టీజర్‌లో మీరు చూసింది కేవలం ఇన్నోసెంట్‌గా ఉండే క్యారెక్టర్‌. ఈ సినిమాలో మరో రెండు క్యారెక్టర్స్‌లో కూడా కనిపిస్తాను. ఆ క్యారెక్టర్స్‌లోకి ఎందుకు ట్రాన్సఫార్మ్‌ అవ్వాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి? అని సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో నేను చేసిన మూడు డిఫ్రెంట్‌ క్యారెక్టర్స్‌ కూడా ఆడియన్స్‌ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తాయి.

ఈ క్యారెక్టర్‌ ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉందా?
– ప్రత్యేక కారణం అంటూ ఎం లేదు. కానీ ఈ ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు అనే క్యారెక్టర్‌ యొక్కఇంపాక్ట్‌ అనేది ప్రతి ఒక్కరిలోను ఉంటుంది. వారి వారి ఆలోచన విధానం బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అదీకాక ఈ మధ్య విద్యావ్యవస్థ కూడా బట్టి వైపు పరుగులు తీయిస్తోంది. అంత కష్టపడి చదివాక ర్యాంక్‌ రాక పొతే ఇంకా జన్మేలేదు అని ఆత్మహత్యల వైపు పరుగెడుతోంది యువతరం. అది నిజం కాదు అని తెలియజెప్పే ప్రయత్నమే మా సినిమా. ఇదొక యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. ఏ లాంగ్వేజ్‌ లోనైనా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారు అనే నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది.

కన్నడ వెర్షన్‌కు తెలుగులో ఏమైనా చేంజెస్‌ చేశారా?
– చాలా చేంజెస్‌ ఉన్నాయి. మేము కన్నడ సినిమాలోంచి సోల్‌ మాత్రమే తీసుకున్నాం. మిగతాదంతా మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు దర్శకుడు నరేష్‌ కుమార్‌ ట్రాన్సఫార్మ్‌ చేశారు. డెస్టినేషన్‌ ఒకటే అయినా జర్నీ మాత్రం డిఫరెంట్‌ గా ఉంటుంది.

ఈ సినిమాకు దర్శకుడు మారుతి చాలా హెల్ప్‌ చేశారు కదా?
– అవునండీ! మారుతి గారు మా ఫ్యామిలీఫ్రెండ్‌. అలాగే ఈ కథను తెలుగు ఆడియన్స్‌ కి కనెక్ట్‌ అయ్యేలా కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో మారుతి గారు కొన్ని అమూల్యమైన సజెషన్స్‌ ఇవ్వడం జరిగింది. అలాగే సినిమా విడుదల విషయంలో కూడా మాకు చాలా హెల్ప్‌ చేస్తున్నారు అందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

హీరోయిన్‌ కౌశిక్‌ ఓరా గురించి చెప్పండి?
– ఈ సినిమాలో కౌశిక్‌ ఓరా చాలా మోడర్న్‌ అమ్మాయిలా కనిపిస్తుంది. తన అందంతో పాటు అభినయంతో కూడా ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తుంది. ఆమెకు తెలుగురాక పోయినా చాలా కష్టపడి ప్రతి సీన్‌ని, డైలాగ్‌ని అర్ధం చేసుకొని చెప్పేది. మా సెట్‌ లో ఆమె ఫస్ట్‌ ర్యాంక్‌ రాణిలా ఉండేది. సినిమా ద్వారా ఆమెకి కచ్చితంగా మంచి పేరు వస్తుంది.

మిగతా క్యారెక్టర్స్‌ గురించి?
– ఈ సినిమా స్టూడెంట్స్‌కి ఎంత ఇంపార్టెంటో.. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్‌. ఎందుకంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుందో నా తండ్రి క్యారెక్టర్‌ అయిన నరేష్‌ గారికి కూడా అంతే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రస్తుత సమాజానికి కావలిసిన ముఖ్యమైన సందేశం కూడా ఉంటుంది.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ ?
– ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి మీదా ఇంకాకొంతవర్క్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమా విడుదల అయ్యాక వాటి గురించి వివరిస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో చేతన్ మద్దినేని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here