మెగాస్టార్ ఆశీస్సులందుకున్న ఐశ్వర్య రాజేష్

0
431

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు సమర్పణలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కే ఏ వల్లభ నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తమిళనాడులోని రామనాథపురం లో ఒక తమిళ చిత్రం షూటింగ్ నుండి ఐశ్వర్య రాజేష్, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులందుకోవడానికి వీడియో కాల్ చేశారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్నందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ మా కొలీగ్ రాజేష్ కూతురు ఇంత మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ఐశ్వర్య రాజేష్ కి ఆశీస్సులు అందించి ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here