నేడు ఉదయం నుండి ప్రముఖ దిగ్గజ దర్శకులు మణిరత్నం గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో చేరారు అంటూ పలు వార్తలు కొన్ని మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అసలు ఆ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో చాలామందికి అర్ధం కాలేదు. అయితే కాసేపటి క్రితం అయన భార్య, మరియు ప్రముఖ నటి అయిన సుహాసిని గారు ప్రచారం అవుతున్న ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
మణిరత్నం గారు ఉదయం 9:30 గంటలకు తనకిష్టమైన రోటీ, మామిడికాయ పచ్చడి తిని స్క్రిప్ట్ వర్క్ కోసం యధావిధిగా ఆఫీసుకు వెళ్లిపోయారు అంటూ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే మణిరత్నం గారు రొటీన్ చెకప్ తర్వాత తన తర్వాతి చిత్రం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక సుహాసిని మణిరత్నం పోస్ట్ తరువాత మణిరత్నం గారికి ఏమి కాలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయన ‘పొన్నియన్ సెల్వన్’ పనుల్లో బిజీగా ఉన్నటు సమాచారం.


