ఈ నెల 19న ‘డియర్ కామ్రేడ్’ మూడవ పాట విడుదల…!!

0
697

హీరోగా నటించిన తోలి చిత్రం పెళ్లి చూపులు మంచి విజయవంతమైన తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన నటుడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం అయన రష్మికతో జోడి కడుతూ భరత్ కమ్మ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు రెండు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో ఎల్లుండి, జూన్ 19న సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రంలో మూడవ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ పాట నాలుగు భాషల్లోనూ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విజయ్ ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారని, రేపు విడుదల తరువాత చిత్రం ప్రేక్షకుల అంచనాలు తప్పక అందుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అలానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని జులై నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here