సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి, కెరీర్ పరంగా మహేష్ బాబు 25వ సినిమాగా విడుదలైన మహర్షి, కెరీర్ పరంగా సూపర్ స్టార్ సినిమాల్లోనే అతి పెద్ద సక్సెస్ గా నిలవడమే కాక, పలు చోట్ల అద్భుతమైన కలెక్షన్ల రికార్డులు నెలకొల్పి ఇప్పటికీ స్టడీగా ముందుకు సాగుతోంది. ఇక మహర్షి మూవీ సక్సెస్ లో పాటలు కూడా ఎంతో ప్రధాన పాత్ర వహించాయి అనే విషయం తెలిసిందే.
అయితే ఆడియోలో మొదటిగా వీక్షకుల ముందుకు వచ్చిన చోటి చోటి బాతే సాంగ్ సూపర్బ్ రెస్పాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. కాసేపటి క్రితం ఈ సాంగ్ మేకింగ్ వీడియోని మహర్షి చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. విడుదలైన దగ్గరినుండి మంచి వ్యూస్ తో ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో దూసుకుపోతోంది…!!


