హాలీవుడ్‌ స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ‘సాహో’ టీజర్‌

0
72

‘బాహుబలి’ చిత్రంతో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ క్రేజ్‌ మరియు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిన విషయం అందరికీ తెల్సిందే. అంతటి సంచలన విజయం తర్వాత యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ బ్యానర్‌ పై యంగ్‌ ప్రొడ్యూసర్స్‌ వంశీ, ప్రమోద్‌ హై టెక్నికల్‌ వాల్యూస్‌తో పాటు హాలీవుడ్‌, బాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో రూపొందిస్తున్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో. ఇండిపెండెన్స్‌ డే కానుకగా అగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా విడుదలకి సిద్ధమౌతోంది. బాలీవుడ్‌ అందాల భామ శ్రద్ధాకపూర్‌ ప్రభాస్‌కి జోడిగా నటిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ ఛాప్టర్‌1, ఛాప్టర్‌ 2’లకు టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ . లేటెస్ట్‌గా జూన్‌ 13న యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు, సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్‌ విడుదలయ్యింది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం కోసం బాలీవుడ్‌, హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి, సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించారని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ”బాధైనా హ్యాపీనెస్‌ అయినా నాతో షేర్‌ చేసుకోవడానికి ఎవ్వరూ లేరు” అంటూ కథానాయిక శ్రద్ధా కపూర్‌ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇందుకు ప్రభాస్‌.. శ్రద్ధను ఆలింగనం చేసుకుని ‘నేనున్నాను’ అని చెప్పడంతో టీజర్ లో యాక్షన్ పార్ట్ మొదలవుతుంది . యాక్షన్‌ సన్నివేశాలు హై టెక్నికల్‌ స్టాండర్స్‌లో ఉండి, హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలకు ధీటుగా ఉన్నాయి. ఇక టీజర్‌ చివర్లో దుండగుల నుంచి ప్రభాస్‌, శ్రద్ధ తప్పించుకుని ఓ చోట దాక్కుంటారు. అప్పుడు శ్రద్ధ ‘ఎవరు వీళ్లు’ అని ప్రభాస్‌ను అడిగితే.. అందుకు ప్రభాస్‌.. ‘ఫ్యాన్స్‌’ అని సమాధానమిస్తారు. ఆ తర్వాత శ్రద్ధ.. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ అని అడగ్గా.. ”డై హార్డ్‌ ఫ్యాన్స్‌” అని ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఫ్యాన్స్‌నే కాదు.. కామన్‌ ఆడియన్స్‌ని సైతం విపరీతంగా ఆకట్టుకొంటోంది. ఈ టీజర్‌లో యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌, శ్రద్దా కపూర్‌ స్టైలిష్‌ లుక్స్‌, యు.వి. క్రియేషన్స్‌ ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ మేకింగ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ హైలైట్స్‌గా నిలుస్తున్నాయి. జిబ్రాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కొత్తగా ఉంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో క్యాప్చర్‌ చేసిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు విజువల్‌ ట్రీట్‌గా ఉన్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మధి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరీల్‌, ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ ‘సాహో’ చిత్రానికి మంచి ఎస్సెట్స్‌ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ‘సాహో’ ఇండిపెండెన్స్‌ డే కానుకగా అగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా విడుదలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here