హిలేరియస్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మన్మధుడు 2’  టీజర్ విడుదల

0
55

 కింగ్ నాగార్జున హీరోగా  మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మాత‌లు.  ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది.  ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున‌- ర‌కుల్‌, నాగార్జున‌- కీర్తిసురేష్ ఫోటోలు ఇప్పటికే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్  చేస్తున్నాయి . సినిమాపై  అటు నాగార్జున అభిమానుల్లోనూ, ఇటు కామన్ ఆడియన్స్ లోనూ  మంచి అంచ‌నాలున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ విడుదలైంది.

మ‌న్మ‌థుడు ఇన్‌స్పిరేష‌న్‌తో రాహుల్ ర‌వీంద్ర‌న్  ఈ సినిమాను ఒక  ఫ‌న్ రైడ‌ర్ గా తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. నీకు ష‌ట‌ర్లు మూసేసి దుకాణం స‌ర్దేసే వ‌య‌సొచ్చేసింది దేవ‌ద‌ర్శిని చెబితే నాగార్జున ఆశ్చ‌ర్య‌పోతారు.  ఇంత అందంగా పుట్టి ఏం  ప్ర‌యోజనం ఉండ‌దురా! అనే డైలాగ్‌తో సినిమా టీజ‌ర్ ప్రారంభ‌మైంది.

మీ వ‌య‌సులో మీకు పెళ్లేంటి సార్‌? ఎండిపోయిన చెట్టుకు మళ్ళీ నీళ్లుపోస్తే  పూలు పూస్తాయా? అని వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్‌..
పిల్ల‌ల‌కు కోచింగ్ ఇవ్వాల్సిన వ‌య‌సులో బ్యాటింగ్‌కు దిగుతానంటావేంట్రా అంటూ రావు ర‌మేష్ చెప్పే డైలాగ్‌..
నాగార్జున లిప్ లాక్ స‌న్నివేశాలు.. రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చూస్తే సినిమా మంచి  హిలేరియస్ లవ్  ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం ఆకట్టుకుంది. ఇక  ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ఈ సినిమాను ఆగష్టు 9 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

కింగ్ నాగార్జున‌,ర‌కుల్ ప్రీత్ సింగ్‌,ల‌క్ష్మి,వెన్నెల‌కిషోర్‌,రావు ర‌మేష్‌,ఝాన్సీ,దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌,మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌,స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌,ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి, డైలాగ్స్‌:  కిట్టు ,విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని, నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌, ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here