ఫేవరెట్ క్రికెటర్ తో సూపర్ స్టార్ మహేష్ మెమొరబుల్ మూమెంట్…!!

0
42

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం, ప్రస్తుతం విదేశాల్లో వున్నారు. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ని లండన్ లో కుటుంబసమేతంగా వీక్షించిన సూపర్ స్టార్, నేడు తనకు ఎంతో ఇష్టమైన వెస్ట్ ఇండీస్ క్రికెటర్ ఆండీ రాబెర్ట్స్ తో కలిసి దిగిన ఫోటోను కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు .

నాకు ఎంతో ఇష్టమైన సీనియర్ క్రికెటర్ ఆండీ రాబెర్ట్స్ గారిని కలవడం జరిగింది, ఇది నిజంగా ఆయనకు ఫ్యాన్ గా నాకు ఎప్పటికీ సంతోషం కలిగించే విషయం అంటూ మహేష్ తన పోస్ట్ లో తెలిపారు. మొదటినుండి సినిమాలతో పాటు క్రికెట్ ను ఎంతో ఇష్టపడే సూపర్ స్టార్ మహేష్, ఇండియా పాల్గొనే మ్యాచెస్ ని ఎంతో శ్రద్ధగా ఇష్టంగా చూస్తానని, అంతేకాక సినిమాల తరువాత తనకు బాగా ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేది క్రికెట్ అని అయన తన ఇంటర్వ్యూల్లో చెపుతూ ఉంటారు. కాగా మహేష్ పోస్ట్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here