రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ స్టైలిష్ యాక్షన్ టీజర్…!!

0
50

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో. బాహుబలి సిరీస్ సినిమాల అద్భుత విజయాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. రన్ రాజా రన్ మూవీ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సహా మూవీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ రోజు రానే వచ్చింది, కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదలైన ఈ టీజర్ కు నెటిజన్స్ బ్రహ్మరధం పడుతున్నారు.

టీజర్ ఆద్యంతం మంచి యాక్షన్, ఛేజింగ్ సీన్స్ తో ఆకట్టుకుంది. ప్రభాస్ న్యూ ఏజ్ యాక్షన్ తో చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, క్వాలిటీ తో ఉన్న సన్నివేశాలు చూస్తుంటే ‘సాహో’ యాక్షన్ అభిమానులకి పండగలా ఉండబోతోంది.  టీజర్లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంట బాగా ఆకట్టుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ తో సాగే టీజర్ ని ‘ఫాన్స్…డై హార్డ్ ఫాన్స్’ డైలాగ్ తో లైటర్ వీన్ లో ముగించడం చాలా బాగుంది టీజర్ కు గిబ్రాన్ అందించిన నేపధ్య సంగీతం మరొక ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. ఈ టీజర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది .జాకీ ష్రాఫ్ ఎల్విన్ శర్మ, మందిర బేడీ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here