తెలుగులో తన అద్భుతమైన నటన మరియు డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే నటుడు నటప్రపూర్ణ మోహన్ బాబు. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నమోహన్ బాబు ఒక తమిళ సినిమాలో నటించనున్నారు. వెర్సటైల్ హీరో సూర్య తో లేడీ డైరెక్టర్ సుధా కొంగర రూపొందిస్తున్న కొత్త సినిమా ‘సూరారై పోట్రు’ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో ఆయన నటించనున్నారు .

మహానటి తమిళ వెర్షన్ లో కూడా నటించిన మోహన్ బాబు, మరొక్కమారు ఈ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.  ఈ సినిమాలో మహర్షి తో సూపర్ హిట్ కొట్టిన కథానాయిక పూజ హెగ్డే, హీరో సూర్య సరసన జతకడుతున్నట్లు సమాచారం. ఇదివరకు ద్రోహి, ఇరుది సుట్రూ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సుధా గారు, ఈ సినిమాతో కూడా మరొకవిజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటోంది చిత్ర బృదం. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట…!!