సాహో టీజర్ కు దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు…!!

0
26

బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం సాహో. రన్ రాజా రన్ చిత్రంతో మంచి సక్సెస్ ని అందుకున్న దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్ యూట్యూబ్ లో విడుదలై వ్యూస్ పరంగా పలు సంచలనాలు సృష్టిస్తోంది. ఇక టీజర్ ని చూసిన సాధారణ ప్రేక్షకులు సహా, ఎందరో సినీ ప్రముఖులు సైతం అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు.

‘సాహో’ టీజర్ పై దర్శకధీరుడు రాజమౌళి తన స్పందనను సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. యువి క్రియేషన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడిగా సుజీత్ ఒక చక్కని బాధ్యతగా దానిని స్వీకరించి న్యాయం చేసారని, ధీరత్వంతో పాటు తనలోని సున్నితత్వాన్ని కూడా ఆవిష్కరించడం డార్లింగ్ ప్రభాస్ లో ని ప్రత్యేకత  అంటూ రాజమౌళి తన పోస్ట్ ద్వారా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here