గోపీచంద్ చాణక్య ఫస్ట్ లుక్ రేపే…!!

0
40

యంగ్ హీరో గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా చాణక్య. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామ బ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోని మొన్న విడుదల చేయడం జరిగింది. అయితే రేపు గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మధ్యాహ్నం 2.34 నిమిషాలకు సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృదం తెలిపింది.

ఇందులో మెహరీన్, జరీనా ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికపాటి, మాటల రచయిత: అబ్బూరి రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here