నితిన్ కొత్త చిత్రం ‘భీష్మ’ రేపు ప్రారంభం…. !!

0
24

యంగ్ హీరో నితిన్, మరియు ఇటీవల చలో వంటి సూపర్ హిట్ అందుకున్న క్రేజీ డైరెక్టర్ వెంకీ కుడుముల కలయికలో రూపొందనున్న కొత్త సినిమా భీష్మ. గత ఏడాది విడుదలైన శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్ నటిస్తున్న సినిమా ఇదే. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమం రేపు అధికారికంగా జరుగనుంది. ఒక విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

సింగల్ ఫర్ ఎవర్ అని పెట్టిన ఈ చిత్ర ఉప శీర్షికను బట్టి చూస్తే ఇది  వైవిధ్యమైన చిత్రమని మనకు అర్ధం అవుతుంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటెర్టైమెంట్స్ పతాకం పై రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తదితర వివరాలన్నీ కూడా రేపటి పూజ కార్యక్రమాల ద్వారా తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here