విష్ణు ‘ఓటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్…!

0
18

మంచు విష్ణు హీరోగా జి కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘ఓటర్’ విడుదల తేదీ ఖరారయింది. ఓటు యొక్క ప్రాముఖ్యత, దేశంలోని పౌరులు ఓటు వేయటాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనే అంశంతో ఈ సినిమా రూపొందినట్లు చిత్ర బృదం చెపుతోంది. ఈ సినిమాను ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రంలో విష్ణు సరసన సురభి హీరోయిన్ గా నటిస్తుండగా సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, సుప్రీత్, నాజర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాని రామ రీల్స్ బ్యానర్ పై జాన్ సుధీర్ పూదోట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here