విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ గారి నట వారసత్వంతో టాలీవుడ్ కి తాతమ్మ కల సినిమా ద్వారా రంగప్రవేశించిన నటుడు నందమూరి బాలకృష్ణ. అప్పటినుండి ఇప్పటివరకు సాగిన అయన సినీ ప్రస్థానంలోజయాపజయాలు ఎన్నో చూసారు బాలకృష్ణ. ఇక అభిమానులు ఆయనను ముద్దుగా బాలయ్య, నందమూరి నటసింహం, యువరత్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక నేడు తన 59వ జన్మదినం జరుపుకుంటున్న బాలయ్యకు అభిమానులు మరియు ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువలా లభించాయి.
ఇక నేటి ఉదయం బాలయ్యతో త్వరలో కొత్త చిత్రాన్ని తీయనున్న దర్శకులు కేఎస్ రవికుమార్ మరియు నిర్మాత సి కళ్యాణ్ లు ఆయనకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెల్పడం జరిగింది. ఇకపోతే కాసేపటి క్రితం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ అక్కడి సిబ్బంది మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అయితే అంతకు ముందు క్యాన్సర్ రోగులను పరామర్శించిన బాలకృష్ణ, వారికి అన్నివిధాలుగా అండగానిలిచి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు….!!