ప్రముఖ నాటక రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్ మృతి…!!

0
403

సుప్రసిద్ధ కన్నడ రచయిత మరియు నటుడైన గిరీష్ కర్నాడ్ నేటి ఉదయం బెంగళూరు లోని అయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అయితే ఈ ఉదయం అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించినప్పటికీ ఆయన అప్పటికే మృతి చెందారని తెలుస్తోంది. కన్నడ నాటకసాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికి మరిచిపోలేవనే చెప్పాలి. దానికి గాను ఆయనకు అప్పటి ప్రభుత్వం నుండి జ్ఞానపీఠ అవార్డు కూడా లభించింది. అంతేకాక నాటకసాహిత్య రంగం తరపున ఆ అవార్డు అందుకున్న తొలివ్యక్తి కూడా ఆయనే కావడం చెప్పుకోదగ్గ విషయం.

అంతేకాదు ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ మరియు పద్మభూషణ్ అవార్డులు కూడా లభించాయి. మే19, 1938లో మహారాష్ట్రలోని మథెరన్ ప్రాంతంలో జన్మించిన గిరీష్ కర్నాడ్ గారి పూర్తి పేరు గిరీష్‌ రఘునాత్‌ కర్నాడ్‌, తొలుత కన్నడ నాటక రంగంలో పేరుగాంచి అయన తదుపరి సినిమాల్లోకి ప్రవేశించారు. సినిమా పరిశ్రమకు ఆయన నటుడుగా, రచయితగా, అలానే దర్శకుడిగా పలు సేవలందించారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు వంటి పలుభాషల్లో అయన నటించడం జరిగింది. ఇక తెలుగులో అయన నటించిన ఆనందభైరవి, ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాల్లోని పాత్రలకు మంచి పేరు లభించింది. అంతటి గొప్పవ్యక్తి మరణం సినీ కళామతల్లికి తీరని లోటని పలువురు ప్రముఖులు అయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here