‘వాల్మీకి’ టీమ్ తో మరొక్కసారి పని చేయడం ఆనందం ఉంది : పూజ హెగ్డే

0
31

ఇటీవల టాలీవుడ్ లో మంచి విజయవంతమైన చిత్రాలు చేస్తూ వరుసగా ఒక్కొక్కటిగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకుసాగుతున్న ముద్దుగుమ్మ పూజ హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ, ఇటీవల జూనియర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అలానే సూపర్ స్టార్ మహేష్ సరసన మహర్షి లో నటించి రెండు భారీ విజయాలు తన ఖాతాలో వేసుకుంది.

ఇక ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో పాటు, వరుణ్ తేజ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న వాల్మీకిలోను హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించింది. నిజానికి హరీష్ శంకర్ తో డీజే లోను, అలానే వరుణ్ తేజ్ తో ముకుందా లోను గతంలో పనిచేసిన పూజ, ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న వాల్మీకి ద్వారా మరొక్కసారి వారిద్దరితో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట లు నిర్మిస్తున్నారు. కాగా సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here