మేఘాంశ్ శ్రీహరి ‘రాజ్ దూత్’ టీజర్ కి మంచి స్పందన

0
599

దివంగత నటులు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారి నటన మరియు అయన పలికే డైలాగులు ఎంత అద్భుతంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట్లో తెలుగు సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో నటించిన శ్రీహరి గారు, తరువాత పూర్తిసాయి హీరోగా మరి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అయన మరణాంతరం ప్రస్తుతం అయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి త్వరలో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇందుకోసం మేఘంశ్ నటన, ఫైట్స్, మరియు డ్యాన్సుల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఇక అయన హీరోగా రూపొందుతున్న రాజ్ దూత్ సినిమా టీజర్ నిన్న యూట్యూబ్ లో విడుదల అయింది.

కాగా ఈ టీజర్ విడుదల కార్యక్రమానికి మేఘంశ్ తల్లి గారైన శాంతి, మరియు ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ తదితరులు హాజరయి, తొలి సినిమాతోనే మేఘంశ్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అతడిని ఆశీర్వదించారు. ఇక ఈ టీజర్ లో మొదట ఒక బైక్ కనబడడం, దానికి హాస్య నటుడు సునీల్ వాయిస్ ఓవర్ ఇస్తూ డైలాగులు చెప్పడం ఎంతో ఫన్నీ గా ఉంటుంది. అలానే ‘అందుకే అంటారు అమ్మాయిలకు ఢిల్లీ, అబ్బాయిలకు పెళ్ళి కాదని’ అని మేఘంశ్ పలికే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇకపోతే ప్రేక్షకులను అలరిస్తున్న ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో 17వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. టీజర్ లానే సినిమా కూడా అందరిని ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here