జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా సప్తగిరి ‘వ‌జ్ర‌క‌వ‌చ‌ధర గోవింద‌’ విడుదల

0
32

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమాల తర్వాత టాప్‌ కమెడియన్‌ హీరో సప్తగిరి నటించిన చిత్రం ‘వజ్రకవచధర గోవింద’. శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ప‌నులు మొత్తం పూర్తిచేసుకుని జూన్ 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య రెండు రాష్ట్రాల్లో విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

ప్రముఖ డిస్ర్టిబ్యూట‌ర్ బ్ర‌హ్మ‌య్య మాట్లాడుతూ… నేను రాయ‌ల‌సీమ‌లో 32ఏళ్ళుగా డిస్ర్టిబ్యూట‌ర్‌గా ఉన్నాను. ఈ సినిమా చూసి న‌చ్చి సీడెడ్ రైట్స్‌ను కొన‌దాం అనుకున్నా. సింగిల్ పేమెంట్‌లో నేను ఈ సినిమాను కొనడం జ‌రిగింది. నాకు ఆ భ‌గ‌వంతుడు ఆ సంక‌ల్పాన్ని క‌లిగించి ఈ 14వ తేదీన రిలీజ్ అయ్యేలా చేశారు. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన స‌ప్త‌గిరి తో పాటు టీం అందరికి నా కృత‌జ్ఞ‌తాభివంద‌న‌ములు అన్నారు.

పొడ్యూస‌ర్ నరేంద్ర యెడల మాట్లాడుతూ… జూన్ 14న మీముందుకు వ‌స్తున్నాం అంద‌రూ ఆశీర్వ‌దించండి. ఒక ఊరి ప్ర‌జ‌ల‌ను ఏ విధంగా కాపాడాడు అన్న‌దే క‌థ. మమ్మ‌ల్ని ఇంత దూరం న‌డిపించిన స‌ప్త‌గిరిగారికి చాలా థ్యాంక్స్‌. ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఆర్టిస్ట్‌కి పేరు పేరున నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. మా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం. స‌ప్త‌గిరిగారు లేక‌పోతే మేము ఇక్క‌డ లేము. ఎప్పుడూ ఎల్ల‌వేళ‌లా నా వెంట ఉంటూ న‌రేంద్ర‌న్న న‌డిపిస్తూ ఉన్నారు. జూన్ 14న మా న‌రేద్ర‌న్న పుట్టిన రోజు నాడు ఈ చిత్రం విడుద‌ల‌వ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. మ‌మ్మ‌ల్ని మార్కెట్‌కి ప‌రిచ‌యం చేసిన బ్ర‌హ్మం గారికి కూడా చాలా థ్యాంక్స్. మీరంద‌రూ సినిమాని చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు అరుణ్‌ పవార్‌ మాట్లాడుతూ… జూన్ 14న విడుద‌ల కోబోతుంది. ఈ సినిమాని చాలా బాగా తీశాం. చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాలో చాలా మంచి క‌మెడియ‌న్స్ ఉన్నారు. నాకు మాట్లాడే ప్లాట్‌ఫామ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. నాకు ప్రొడ్యూస‌ర్‌గారు ఒక న‌మ్మ‌కాన్ని ఇచ్చారు. ఎంత బ‌డ్జెట్ అయినా ప‌ర్వాలేదు అన్నారు. ఒక రెయిన్ సాంగ్‌ని ఒరిజిన‌ల్ రెయిన్‌లో మంచి ఎమోష‌న్‌తో సీన్‌ని తీశాం. మ‌నం వెళ్ళే మార్గం మంచి దారిని ఎంచుకుంటే అంతా స‌క్సెస్ వైపే వెళుతుంది. మా సినిమాని అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చేలా తీశాం. అని అన్నారు.

స్టార్ కమెడియన్ స‌ప్త‌గిరి మాట్లాడుతూ… ఇది చాలా చిన్న బ‌డ్జెట్ సినిమా కాని దీనికి బ‌య‌ట మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. స‌ప్త‌గిరిఎక్స్‌ప్రెస్‌, స‌ప్త‌గిరిఎల్ ఎల్‌బి , ఒక‌టి హిట్ అయింది. ఒక‌టి మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా నాకు పేరు, డ‌బ్బులు రెండూ తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను. అప్పారావ్‌, అవినాష్ ఇందులో చాలా మంచి పాత్ర‌ల్లో న‌టించారు. చాలా థ్యాంక్స్ అన్నారు. 14న విడుద‌ల‌వుతున్న మా సినిమాని చూసి మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

స్టార్ కమెడియన్ సప్తగిరి, వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్‌ వంశీ, అప్పారావు, అవినాష్‌, రాజేంద్ర జాన్‌ కొట్టోలి, వీరేన్‌ తంబిదొరై తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, ఎడిటింగ్‌: కిషోర్‌ మద్దాలి, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌,, కథ: జి.టి.ఆర్‌. మహేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సలాన బాలగోపాలరావు,ప్రొడ్యూసర్స్ : నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్‌ పవార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here