టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతానికి ఎందరో అభిమానులున్నారు. ఇకపోతే చూడడానికి ముమ్మూర్తులా దేవిని పోలి ఉండే అయన తమ్ముడు సాగర్ కూడా మంచి సింగర్ అనే విషయం తెలిసిందే. అంతేకాదు తమ్ముడికి తన సినిమాల్లోని అక్కడక్కడా కొన్ని పాటలు పాడే అవకాశం కూడా ఇచ్చారు దేవి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తోలి సినిమా ఆర్య లోని ‘ఏదో ప్రియరాగం వింటున్నా’ పాటను ఆలపించిన సాగర్ కు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది.
ప్రస్తుతం సాగర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలయికలో రాబోతున్న కొత్త సినిమా రాక్షసుడు సినిమా ద్వారా డైలాగ్ రైటర్ గా మారుతున్నట్లు దేవిశ్రీప్రసాద్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. తన తండ్రి గారైన దివంగత సత్యమూర్తి గారి వలె తమ్ముడు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగేలా మీ అందరూ సాగర్ ని ఆశీర్వదించాలి అంటూ దేవిశ్రీ తన పోస్ట్ లో కోరారు. నిజానికి దేవి కూడా కేవలం సంగీత దర్శత్వం మాత్రమే కాక, పాటలు కూడా రాస్తుంటారు….!!


