బన్నీ సినిమాలో అక్కినేని హీరో..!!

0
136

అక్కినేని వారి నటవారసుల్లో ఒకడైన అక్కినేని నాగేశ్వర రావు గారి కుమార్తె నాగ సుశీల గారి కుమారుడు సుశాంత్ భారీ చిత్రంలో నటిస్తున్నారు. గత ఏడాది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చి.ల.సౌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుశాంత్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తున్నారు.

ఈ విషయాన్ని సుశాంత్ కాసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. తనకు ఎంతో ఇష్టమైన దర్శకులు త్రివిక్రమ్ గారితో అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారితో పనిచేసే అవకాశం రావడం చాలా ఎక్సయి టింగ్ గా ఉందని, అలాగే టబు, పూజ, పి ఎస్ వినోద్, తమన్ లతో పని చేయడం చాల ఆనందంగా ఉందని చెప్పారు. తను చేస్తున్న ఈ క్యారెక్టర్ ద్వారా తనకు నటుడిగా మరింత నేర్చుకుంటానని భావిస్తున్నట్లు సుశాంత్ తన పోస్ట్ ద్వారా తెల్పడం జరిగింది. నిజానికి ఈ విషయమై కొద్దిరోజలుగా బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో ఒక పాత్రకు సుశాంత్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, నేటి సుశాంత్ పోస్ట్ తో అది వాస్తవమని రుజువయింది. మరి సుశాంత్ చేస్తున్న ఈ పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి…!!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here