సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా తెరకెక్కిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి నేటితో విజయవంతంగా 5వ వారంలోకి ప్రవేశించింది. మూడు వైవిధ్యమైన పాత్రల్లో నటించి అందరిని మెప్పించారు మహేష్. అలానే ఆయనకు మిత్రుడిగా అల్లరి నరేష్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి మార్కులుపడ్డాయి. ఇక ఈ సినిమాలో స్నేహం గొప్పతనం గురించి , అలానే దేశానికి వెన్నెముకైన రైతు గొప్పతనం గురించి, రైతును పట్టించుకోకపోతే మనకు ఎంత నష్టమో తెలిపే అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కించి ఘనవిజయాన్ని అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెయు మోహనన్ అద్భుతమైన కెమెరా పనితనం, అలానే హీరోయిన్ పూజ హెగ్డే అందం మరియు నటన, ముఖ్యంగా సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సంస్థలు ఈ చిత్ర అద్భుత విజయంలో కీలకపాత్ర వహించాయి .


