‘ఓ బేబీ’ తో రెండు కోరికలు తీరాయి : సమంత

0
478

ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక ఆ తరువాత ఆమెకు మంచి అవకాశాలు రావడం, ఆపై వాటిని ఆమె జాగ్రత్తగా అందిపుచ్చుకోవడంతో కొన్నాళ్ళకు సమంత మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి పెద్ద స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. ఇక తరువాత తన తొలిచిత్ర హీరో నాగచైతన్యను తన జీవిత భాగస్వామిని చేసుకుని, అక్కినేని వారి కోడలైన సమంత, అప్పటినుండి కాస్త సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. నిజానికి కెరీర్ పరంగా ఎన్నో హిట్స్ సొంతం చేసుకున్న సమంతను అందరూ గోల్డెన్ హ్యాండ్ అంటుంటారు. ఇక ఇటీవల ఆమె, భర్త చైతన్యతో కలిసి నటించిన మజిలీ సినిమా సూపర్ హిట్ కొట్టి మరొక్క విజయాన్ని ఆమె ఖాతాలో వేసింది.

ఇక ప్రస్తుతం ఆమె, నందిని రెడ్డి దర్శకత్వంలో ఓబేబీ సినిమాలో నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా మీడియా సమావేశంలో మాట్లాడిన సమంత, తనకు సురేష్ ప్రొడక్షన్స్ లో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలనీ, అలానే ఒక పూర్తి స్థాయి వినోదాత్మక సినిమాలో నటించాలని ఉండేదని, అయితే ఆ రెండు కోరికలు ఈ సినిమాతో తీరాయని చెప్పుకొచ్చారు. ఇక దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాత సురేష్ బాబు గారు తనను నిజంగా ఒక బేబీలానే చూసుకున్నారని, తాము ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. ఇకపోతే సీనియర్ నటి లక్ష్మి, నటుడు రాజేంద్ర ప్రసాద్, తేజ సజ్జ తదితరులు నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here