‘హిప్పీ’ యూత్‌ తో పాటు ఫామిలీస్ కి నచ్చే కాంటెంపరరీ మూవీ – దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ

0
198

‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్సీ హీరోహీరోయిన్లుగా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టి.ఎన్‌.కష్ణ దర్శకత్వంలో రూపొందిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘హిప్పీ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్‌ 6న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు టి.ఎన్‌.కృష్ణతో ఇంటర్వ్యూ.

‘హిప్పీ’ అంటే ఏమిటి?

– అదొక హ్యాపీ మూమెంట్‌. ఎంటైర్‌ మూవీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది కాంటెంపరరీ మూవీ. యూత్‌కి ఏం కావాలో అది ఈ సినిమా ద్వారా అందిస్తున్నాం. తప్పకుండా ఈ కాన్సెప్ట్‌ యూత్‌ ఆడియన్స్‌కి నచ్చుతుంది. సేమ్‌ టైమ్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ఆడియన్స్‌ ఎప్పుడైనా అప్‌డేటెడ్‌ వెర్షన్‌ చూడడానికి ఇష్టపడతారు. అందుకే ఇది కాంటెంపరరీ మూవీ. అడల్డ్‌ కంటెంట్‌ ఉన్నప్పటికీ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ప్రజెంట్‌ యూత్‌ డైలీ యాక్టివిటీస్‌ ఏమిటి, ఎలా కనిపిస్తారనేదే ఈ సినిమా.

సింపుల్‌గా కథ గురించి చెప్పండి?

– నిజంగా ఇది సింపుల్‌ కథే. 14వ సెంచరీలో జాన్‌మిల్టన్‌ అనే బ్రిటీష్‌ కవి రాసిన ప్యారడైజ్‌ లాస్ట్‌ ప్యారడైజ్‌ ది ఎండ్‌ అనే రచన ఇన్‌స్పిరేషన్‌గా ఈ కథ రాయడం జరిగింది. ఆ కథ ఆడమ్‌ అండ్‌ ఈవ్‌తో రాశారు. నేను కాంటెంపరరీగా ఇప్పటి యూత్‌ని బేస్‌ చేసుకొని తీశాను.

జె.డి.చక్రవర్తి క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్‌ ఉంటుంది?

– ఆయన క్యారెక్టర్‌ ఈ సినిమా చాలా స్పెషల్‌ అని చెప్పాలి. ప్రతి ఒక్కరికీ ఈ క్యారెక్టర్‌ నచ్చుతుంది. ఈ సినిమాలో అతను అరిస్టాటిల్‌లాంటివారు. ఎవరికైనా ఎస్‌ చెప్తారు తప్ప నో చెప్పరు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటే ఓకే అంటారు. ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. ఆమెతో ఉండను అంటే ఓకే అంటారు. అదే ఆయన క్యారెక్టర్‌లో విశేషం.

ఇందులో లిప్‌ లాక్స్‌ ఎక్కువగా ఉన్నట్టున్నాయి?

– ఇందులో లస్ట్‌ ఉందా అని చాలా మంచి అడుగుతున్నారు. ఈ సినిమాలో లవ్‌ మాత్రమే ఉంది కానీ లస్ట్‌ లేదు. లిప్‌లాక్‌లు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి ఎ సర్టిఫికెట్‌ ఇస్తారని చాలా మంది అన్నారు. పాత సినిమాల్లో ముద్దు పెడితే చిలకను చూపిస్తారు, లేదా పువ్వుల్ని చూపిస్తారు. అది ఇప్పుడు చూపిస్తే ఎలా ఉంటుంది? అన్నీ అప్‌డేట్‌ అవుతున్నాయి. మనం కూడా అప్‌డేట్‌ అవ్వాలి. సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత కల్చరల్‌ ట్రాన్స్‌మిషన్‌ అయింది. అది మంచికా, చెడుకా అనేది తర్వాతి విషయం. కానీ, అది జరిగింది. మనం కూడా ట్రాన్స్‌ఫార్మ్‌ అవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోతాం. అది సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ రంగంలోనైనా అదే జరుగుతుంది.

ఈ సినిమాలో లవ్‌స్టోరీ ఎలా ఉంటుంది?

– ఇది కంప్లీట్‌ లవ్‌ ఫిల్మ్‌. లవ్‌ అనేది ఎలా పుడుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు దాన్ని అలా ఎవరూ చూపించలేదని నా అభిప్రాయం.

తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు?

– ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో తెలుగు నేర్చుకున్నాను. తమిళ్‌లో రాసిన స్క్రిప్ట్‌ తెలుగులో ఎగ్జాక్ట్‌ అదే మీనింగ్‌తో రావాలంటే నాకు తెలుగు తెలిసి ఉండాలి. కాబట్టి తెలుగు నేర్చుకున్నాను.

మీరు ఆర్‌ఎక్స్‌ 100 రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. కానీ, అదే హీరోతో తెలుగులో సినిమా చేశారు. దీనికి నిర్మాతను ఎలా కన్విన్స్‌ చెయ్యగలిగారు?

– థానుగారికి కథ చెప్పిన తర్వాత తెలుగులో కార్తికేయ అనే హీరో ఉన్నాడు. అతనితో చేస్తే బాగుంటుందని చెప్పాను. దానికి థానుగారు ‘మీరు చైనీస్‌లో తీసినా నేనే ప్రొడ్యూస్‌ చేస్తాను. హీరో ఎవరైనా ఫర్వాలేదు. చెయ్యండి’ అన్నారు.

తమిళ్‌లో కూడా తీశారా?

– లేదు. ఇది డైరెక్ట్‌ తెలుగు సినిమా. తెలుగు భాషలోనే రిలీజ్‌ అవుతుంది. తమిళనాడులో కూడా తెలుగు వెర్షనే రిలీజ్‌ చేస్తున్నాం. డబ్బింగ్‌ చేసే ఆలోచన కూడా లేదు. రెండు వెర్షన్స్‌లో ఎందుకు చెయ్యలేదంటే దానికీ ఓ కారణం ఉంది. ఒక్కో లాంగ్వేజ్‌కి ఒక్కో బూటీ ఉంటుంది. దాన్ని మిక్స్‌ చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందుకే తెలుగులోనే తీశాం. ఈ సినిమా ట్రైలర్‌ చూసి తమిళ్‌ హీరోలు రీమేక్‌ చేస్తాం అంటున్నారు. అయితే తమిళ్‌లో నేను డైరెక్ట్‌ చేస్తానా లేదా అనేది ఆలోచించలేదు.

నువ్వు నేను ప్రేమ తర్వాత ఇంత గ్యాప్‌ రావడానికి రీజన్‌?

– ఆ సినిమా తర్వాత ‘నెడున్‌చాలై’ అనే సినిమా చేశాను. అది ఒక బ్యాడ్‌ టైమ్‌. బ్యాడ్‌ టైమ్‌ అందరికీ వస్తుంది. నాకూ వచ్చింది. ఇప్పుడు అయిపోయింది.

ఈ సినిమా ద్వారా మెసేజ్‌ ఏమైనా ఇస్తున్నారా?

– ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ ఏదైనా ఏదో ఒక మెసేజ్‌ ఇవ్వాలి. అలా ఇవ్వలేనపుడు ఆడియన్స్‌ని ఆ సినిమా ఆకట్టుకోదు. ఈ సినిమా విషయానికి వస్తే యంగస్టర్స్‌ మధ్యలో రిలేషన్‌షిప్‌ సమస్య అనేది ఎలా వస్తుంది, ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఈ సినిమాలో డిస్కస్‌ చేశాం. దాన్ని ఎలా సాల్వ్‌ చెయ్యాలి, ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి అనేది చూపించాం.

తెలుగులోనే కంటిన్యూ అవుతారా?

– నాకు తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చింది. ఇక్కడ నాకు మంచి ఆఫర్సే వస్తున్నాయి. తప్పకుండా తెలుగులో కంటినూగా సినిమాలు తీస్తాను. థానుగారి బేనర్‌లోనే తెలుగు, తమిళ్‌ భాషల్లో ఒక సినిమా చెయ్యబోతున్నాను. అది ఇమ్మీడియట్‌గా స్టార్ట్‌ అవుతుంది. అలాగే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలో కూడా ఒక సినిమా చెయ్యాలి. ఈ సినిమా కంటే ముందే ఈ ప్రపోజల్‌ వచ్చింది అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here