జూన్‌ 5న ప్రీమియర్స్‌తో ప్రారంభమై జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘సెవన్‌’

0
435

హవీష్‌ కథానాయకుడిగా నిజార్‌ షఫీ దర్శకత్వంలో కిరణ్‌ స్టూడియోస్‌ పతాకంపై రమేష్‌వర్మ నిర్మించిన డిఫరెంట్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘సెవెన్‌’. రెజీనా, నందితా శ్వేత, అనీష్‌ ఆంబ్రోస్‌, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌ రైట్స్‌ను అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా సొంతం చేసుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 5న మల్టీప్లెక్స్‌లలో ప్రీమియర్స్‌తో ప్రారంభించి జూన్‌ 6న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో హవీష్‌, హీరోయిన్లు నందితా శ్వేత, పూజిత, త్రిదా చౌదరి, అభిషేక్‌ పిక్చర్స్‌ అభిషేక్‌ నామా పాల్గొన్నారు.

అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా మాట్లాడుతూ ”ఈ సినిమా జూన్‌ 5న మల్టీప్లెక్స్‌లలో ప్రీమియర్స్‌తో ప్రారంభమై జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాకి రమేష్‌వర్మ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు రాయడమే కాకుండా ప్రొడ్యూస్‌ చేశారు. ఈ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. అందుకే వరల్డ్‌వైడ్‌ రైట్స్‌ తీసుకున్నాను. ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు. ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ సినిమా అందర్నీ థ్రిల్‌ చేస్తుంది. ఈ సినిమాని జూన్‌ 6న అందరూ చూసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నందితా శ్వేత మాట్లాడుతూ – ”ఈ సినిమా సమ్‌థింగ్‌ స్పెషల్‌ నాకు. స్ట్రెస్‌ అనేది లేకుండా నాకు బాగా నచ్చిన డీసెంట్‌ క్యారెక్టర్‌ ఇది. నేను బాగా పెర్‌ఫార్మ్‌ చేశానని చెప్పను. క్యారెక్టరే నాతో చేయించింది. చాలా వెయిట్‌ ఉన్న క్యారెక్టర్‌. పోస్టర్స్‌లో చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తున్నాను. ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాబట్టి సినిమా గురించి ఎక్కువ చెప్పను. సినిమా చూసి ఎంజాయ్‌ చెయ్యండి. నిజార్‌గారు నా ఫేవరేట్‌ కెమెరామెన్‌. మాతో ఎంతో కంఫర్టబుల్‌గా చేయించారు. నాతోపాటు నటించిన నందిత, త్రిదా, రెజినా.. ఇలా అందర్నీ ఎంతో అందంగా చూపించారు నిజార్‌. ఫస్ట్‌టైమ్‌ డైరెక్ట్‌ చేస్తున్నప్పటికీ ఎంతో అద్భుతంగా చేశారు. కోస్టార్‌ హవీష్‌ ఎంతో నైస్‌ పర్సన్‌. ఆయనతో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది” అన్నారు.

పూజిత మాట్లాడుతూ ”సెవన్‌ అనే కొత్త టైప్‌ ఆఫ్‌ మూవీతో మీ ముందుకు రాబోతున్నాం. ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించిన రమేష్‌గారు మంచి స్క్రిప్ట్‌ చేశారు. ఆయనే నాకీ సినిమాలో అవకాశం ఇచ్చారు. నిజార్‌గారు ఇంతకుముందు సినిమాటోగ్రాఫర్‌గా చాలా మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు మంచి డైరెక్టర్‌గా కూడా మీ ముందుకు వస్తున్నారు. ఇందులో నటించిన హీరోయిన్స్‌ అందరూ అమేజింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. నిర్మాత రమేష్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ సినిమా నిర్మించారు. అలాగే అభిషేక్‌గారు ఈ సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది” అన్నారు.

త్రిదా మాట్లాడుతూ ”ఈ సినిమాలో నేనూ ఒక భాగమైనందుకు ఆనందంగా ఉంది. నిజార్‌గారితో వర్క్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే హవీష్‌, నందిత, రెజినా.. ఇలా ప్రతి ఒక్కరితో కలిసి వర్క్‌ చేయడం నాకొక గ్రేట్‌ మూమెంట్‌ అని చెప్పాలి. ఇది ఒక మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌. ఈ సినిమాకి ఎంతో ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేశాను. ఈ సినిమాలో నన్ను డిఫరెంట్‌ వే లో చూపించాడు నిజార్‌. ఇందులో రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ కూడా ఉంది. జూన్‌ 5న ప్రీమియర్స్‌తో విడుదలవుతున్న ఈ సినిమాని చూసి అందరూ ఎంజయ్‌ చెయ్యండి” అన్నారు.

హీరో హవీష్‌ మాట్లాడుతూ ”సెవన్‌ మూవీ రిలీజ్‌కి చాలా క్లోజ్‌గా ఉన్నాం. జూన్‌ 5న అన్ని మల్టీప్లెక్స్‌లలో రాత్రి 7.30, 9.30 గంటల షోస్‌తో సినిమా విడుదల కాబోతోంది. 6న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా జర్నీ స్టార్ట్‌ చేసి రెండు సంవత్సరాలు అవుతోంది. కథ విన్నప్పుడు నేను ఎలా ఎక్సైట్‌ అయ్యానో, ట్రైలర్‌ రిలీజ్‌ అయినపుడు కూడా అదే ఎక్సైట్‌మెంట్‌ కలిగింది. ఆ ట్రైలర్‌ అందరిలోనూ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. అభిషేక్‌ పిక్చర్స్‌ వంటి పెద్ద సంస్థ ఈ సినిమాను రిలీజ్‌ చేసేంతగా ఆకట్టుకుంది. మేం ఏదైతే అనుకున్నామో దాన్ని స్క్రీన్‌పైన చూపించగలిగాం అన్న కాన్ఫిడెన్స్‌ వచ్చింది. మంచి కథ అందించిన రమేష్‌వర్మగారికి థాంక్స్‌. ఈ సినిమా నేను డైరెక్ట్‌ చెయ్యను. ప్రొడ్యూస్‌ చేస్తాను. ఎందుకంటే రెండు బర్డెన్స్‌ పెట్టుకుంటే సినిమాకి న్యాయం చెయ్యలేను అని రమేష్‌వర్మగారు అన్నారు. అయితే ఎవరు డైరెక్ట్‌ చేస్తే బాగుంటుందని రమేష్‌గారు అడిగినపుడు నిజార్‌గారైతే బాగుంటుందని చెప్పాను. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్‌గా ఆయన స్టైల్‌ నాకు బాగా నచ్చింది. తప్పకుండా ఈ స్క్రిప్ట్‌కి పూర్తి న్యాయం చేస్తారన్న నమ్మకం కలిగింది. నిజార్‌గారిని కలిసి విషయం చెప్పాం. అయితే అప్పుడే డైరెక్షన్‌ చేసే ఆలోచన లేదని అన్నారు. ముందు కథ వినండి అని వినిపించాం. కథ విన్న తర్వాత ఆయన తప్పకుండా చేస్తానని చెప్పారు. ఎప్పటికైనా డైరెక్షన్‌ చెయ్యాలని అనుకున్నాను. అయితే ఇంత మంచి కథ మళ్ళీ వస్తుందో రాదోనని ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. మేం ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే బెటర్‌గా, గ్లామరస్‌గా, రొమాంటిక్‌గా ఈ సినిమా చేశారు. ప్రతి ఒక్క హీరోయిన్‌ని చాలా గ్లామర్‌గా చూపించారు. ఈ సినిమాకి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించాడు. నిజానికి ఆర్‌ఎక్స్‌ 100 కంటే ముందే మా సినిమాకి వర్క్‌ చేశాడు. ఇందులో మూడు పాటలు, ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఉంది. నాలుగూ ఎంతో అద్భుతంగా చేశాడు. ఈ సినిమా డెఫినెట్‌గా బిగ్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here