ఇస్మార్ట్ శంకర్ టీజర్… కిర్రాకెత్తించిన రామ్-పూరి

0
154

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ కిర్రాక్ ఉంది. వంద మెగావాట్ల విద్యుత్ వైర్ ఎంత కరెంట్ పాస్ చేస్తుందో అంతే వేడిని హీరో పోతినేని రామ్ ఈ టీజర్ లో క్రియేట్ చేశారు.

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ విడుదలైంది. హీరో రామ్ పాత్రను హైఓల్టేజ్ లో చూపించారు. హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగానే సినిమా సాగినట్టు అర్థమవుతోంది. అయితే ఈ టీజర్ లో ఎక్కడా స్టోరీని పూరి రిలీవ్ చేయకపోవడం విశేషం.

హీరో రామ్ చేసిన ఈ పాత్ర చూస్తే అభిమానులంతా ఫిదా అవ్వాల్సిందే.. శంకర్ అనే ముక్కుసూటి మనిషి జీవితంలోని దందాను ఏకచ్ఛత్రాధిపత్యంతో సాగిస్తున్న వైనం టీజర్ లో చూపించారు.

ఇక పూరి ‘పోకిరీ’ తరహాలోనే రామ్ తో చాలా వెరైటీ డైలాగులు పలికించాడు. ఇవి ఊర్రూత లూగిస్తున్నాయి. ‘పోశమ్మ గుడి ముంగిట పొట్టేలు ను కట్టేసినట్టే’నని హీరో రామ్ చెప్పడం టీజర్ లోనే హైలెట్ గా చెప్పవచ్చు.

మణిశర్మ సంగీతం ఈ టీజర్ కు ప్రాణం పోసింది. లుక్స్, హీరో మేనరిజం.. ,జోష్ చూస్తే హీరో రామ్ ఈ సినిమాలో ఊరమాస్ పాత్ర పోషించాడని అర్థమవుతోంది. పూరి మార్క్ హీరోయిజం తాజా ‘ఈస్మార్ట్ శంకర్ ’ కనిపిస్తోందని అందరూ కితాబిస్తున్నారు. మరి టీజర్ తోనే షాకిచ్చిన పూరి.. సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది వేచిచూడాల్సిందే..

‘ఇస్మార్ట్ శంకర్’  టీజర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here