తన అల్ టైం సూపర్ హిట్ చిత్రాలని ప్రదర్శించిన సుదర్శన్ 35 ఎం ఎం కి రానున్నసూపర్ స్టార్ మహేష్

0
94

సూపర్ స్టార్ మహేష్ 25 వ చిత్రం మహర్షి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల, అభిమానుల అపూర్వ ఆదరణతో కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క నైజాం ఏరియా లోనే 5 రోజుల్లో 19.01 కోట్ల రూపాయల రికార్డు షేర్ తో దూసుకెళ్తూ మొదటి వారం లోనే మహేష్ గత చిత్రాల ఫుల్ రన్ రికార్డులని తిరగరాయనుంది. మహేష్ బాబు మహర్షి చిత్ర ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మెమొరబుల్ బ్లాక్ బస్టర్స్ అయిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు సుదర్శన్ 35 ఎం ఎం లో ఎన్నో రికార్డులు సృష్టించాయి. తాజాగా మహేష్ 25 వ చిత్రం ‘మహర్షి’ సుదర్శన్ 35 ఎం ఎం లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మహేష్ కంచుకోట అయిన సుదర్శన్ 35 ఎం ఎం కి ఈ బుధవారం ( మే 15 ) సాయంత్రం 6 గంటలకు రానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here