గోవాలో రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పాట చిత్రీకరణ… రామ్‌ పుట్టినరోజు సందర్భంగా రేపు టీజర్‌ విడుదల

0
160

ఎనర్జటిక్‌ స్టార్‌ రామ్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’.డబుల్‌ దిమాక్‌ హైదరాబాదీ అనేది ట్యాగ్‌ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్‌ నభా నటేశ్‌లపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ నత్య రీతులను సమకూరుస్తున్నారు. రామ్‌ జోడిగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రేపు విడుదల చేస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరిజగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి, ఛార్మి కౌర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:రామ్‌,నిధిఅగర్వాల్‌,నభానటేష్‌,పునీత్‌ ఇస్సార్‌, సత్యదేవ్‌, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, సాహిత్యం: భాస్కరభట్ల,ఎడిటర్‌: జునైద్‌ సిద్ధికీ,ఆర్ట్‌: జానీ షేక్‌,సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట, మ్యూజిక్‌: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్‌,ఛార్మి కౌర్‌, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here