సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘మహర్షి’ చిత్రానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రశంస

0
97

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా పతాకాలపై నిర్మించిన భారీ చిత్రం ‘మహర్షి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌తో రికార్డు కలెక్షన్స్‌ సాధిస్తూ ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌గా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. చక్కని మెసేజ్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ”గ్రామీణ నేపథ్యంలో మంచి సందేశంతో ఈ చిత్రం రూపొందింది. వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ… అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం ‘మహర్షి’. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి చిత్రమిది” అన్నారు.

దీనిపై సూపర్‌స్టార్‌ మహేష్‌ స్పందిస్తూ ”వెంకయ్యనాయుడుగారి ప్రశంస వ్యక్తిగతంగా నాకు, మా చిత్ర యూనిట్‌కి గౌరవంగా భావిస్తున్నాను. దీన్ని మించిన ప్రశంస మరొకటి ఉండదనుకుంటున్నాను. వెంకయ్యనాయుడుగారి మాటలు ‘మహర్షి’ వంటి మరెన్నో మంచి సినిమాలు చేయడానికి మమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేసాయి. సినిమాను చూసి మమ్మల్ని అభినందించిన వెంకయ్యనాయుడుగారికి మా టీమ్‌ తరఫున కృతజ్ఞతలు” అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ ”మా సినిమాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. మీ అభినందన మాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది మాపై ఉన్న బాధ్యతను మరింత పెంచింది. ఈ అభినందన మా టీమ్‌కి ఎంతో సంతోషాన్నిచ్చింది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here