యంగ్ హీరో అల్లు శిరీష్‌, రుక్సానా హీరో హీరోయిన్లుగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందిన కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించారు. ట్రైలర్‌, సాంగ్స్‌కి ప్రేక్షకులకి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ ఇంటర్య్వూ..
ఏబీసీడీ విషయంలో మీరు చాలా కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్నారు?
– నేను ఫస్ట్‌ కాపీ చూశా. చాలా బాగా వచ్చింది. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాను. నేనే కాదు మా టీమ్‌ అందరూ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈ సినిమా ఒరిజినల్‌ వర్షన్‌ చూశారా?
– రెండేళ్ల క్రితం చూశా. దాన్ని తెలుగుకు తగ్గట్టు చాలా మార్చాం. ఇందులో డ్రామాతో పాటు రకరకాల ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ సినిమా గ్రాఫ్‌ నాకు చాలా నచ్చింది. నాకు నేను ఇందులో బాగా నచ్చా. రాంచరణ్‌ ఈ సినిమాను చేయమని నాకు సజెస్ట్‌ చేశాడు. ఆ తర్వాత మారుతి, వరుణ్‌ అందరూ చెప్పారు.

వాళ్లు సజెస్ట్‌ చేసిన తర్వాత మీకు ఇంకా నచ్చిందా?
– నేను ముందు సినిమా చూసినప్పుడే నచ్చింది. కాకపోతే నాకు నచ్చిందని, ఆ స్క్రిప్ట్‌ను నాకోసం చేయమని నేను అడగలేను కదా, ఈ దర్శకుడు కాన్సెప్ట్‌ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.

ఏబీసీడీని అందరూ పిల్లజమీందారుతో పోలుస్తున్నారు?
– థీమ్‌ని వదిలిస్తే, పిల్ల జమీందారుకు, దీనికీ పెద్ద పోలిక ఉండదు. అమెరికాలో ఉండి, గారాబంగా పెరిగిన అబ్బాయిని ఇండియాకు తరిమేస్తే, అక్కడ అతను జీవితం విలువను ఎలా తెలుసుకున్నాడనేది కథాంశం. అంతేగానీ, ఆస్తి అనేది ఉండదు. ఇందులో ఫాదర్‌ సన్‌ విషయం ఉంటుంది.

మీ రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్‌ ఏమైనా ఉన్నాయా?

– అలాంటిదేం లేదండి ! ఈ సినిమాను చూస్తున్నప్పుడు నాకు నా పర్సనల్‌ లైఫ్‌ను చూస్తున్నట్లు అనిపించింది. రియల్‌ లైఫ్‌ తండ్రి కొడుకులను తెరపై చూస్తున్నట్లుగా అనిపించింది. మా నాన్నగారు కూడా గుర్తుకు వచ్చి రెండు, మూడు సార్లు నవ్వుకున్నాను.

మీ నాన్నగారు అలా ఎప్పుడైనా చేశారా?
– లేదండీ. మా నాన్న ఎప్పుడూ అలాంటివి చేయలేదు. కాకపోతే స్పోర్ట్స్‌ కార్‌ అడిగితేనే, ‘ఇన్ని లక్షలిస్తా. మిగిలింది నువ్వు వేసుకుని కొనుక్కో’ అని అన్నారు. అప్పుడు రోషానికి పోయి నేను అది కూడా వద్దనుకుని నా సొంతంగా కొనుకున్నా. ఏ కారైతే కావాలని నాన్నను అడిగానో, దానికి మూడింతలు తక్కువ కారే కుదిరింది. అప్పుడు నాకు అర్థమైంది ఒక్కటే.. డబ్బులు సంపాదించడం అంత కష్టమా? అని. సింగిల్‌ డిజిట్స్‌ను, లాక్స్‌ను సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మరో విషయానికి కూడా నేను కనెక్ట్‌ అయ్యా. అదేంటంటే ముంబై జీవితం. అబ్రాడ్‌ జీవితం. మా నాన్న ఒక అమౌంట్‌ ఇచ్చేసేవారు. దాంతోనే నేను నెలంతా సర్దుకునేవాడినన్నమాట.

యు.ఎస్‌.కి, ముంబైకి వెళ్లినప్పుడు పార్ట్‌టైమ్‌ పనిచేయాలనిపించిందా?
– లేదండీ. నేను మాస్‌ కమ్యూనికేషన్‌ స్టూడెంట్‌ కాబట్టి నేను ఓ పేపర్‌లో ఇంటర్న్‌షిప్‌ చేశా. డీఎన్‌ఏ పత్రికలో అవకాశం వచ్చింది. కానీ దానికి చాలా సమయం పడుతుందని నేను వెళ్లలేదు.

మిగతా వారి గురించి?
– ఈ క్యారెక్టర్‌ చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. సంజీవ్‌ మలయాళం నుండి చక్కగా అడాప్ట్‌ చేశాడు. రామ్‌ సినిమాటోగ్రఫీగారు చక్కటి విజువల్స్‌ అందించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా సాండి.. నాకు ఈ జర్నీలో తను మంచి మిత్రుడయ్యాడు. అలాగే మధుర శ్రీధర్‌గారు, యష్‌ రంగినేని, ధీరజ్‌ మొగిలినేని అందరూ చక్కటి సపోర్ట్‌ అందించారు. నా కోస్టార్‌ భరత్‌ చాలా మంచి పాత్ర చేశాడు. మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్‌ హిట్‌ కాంబినేషన్‌ అవుతుంది. నా తండ్రి పాత్రలో నాగబాబుగారు తప్ప మరెవరినీ ఊహించుకోలేను. బివిఎస్‌ రవి, సత్యానంద్‌, కష్ణచైతన్య, పవన్‌ సాధినేనికి థాంక్స్‌. రుక్సర్‌ గ్లామర్‌తోనే కాదు.. పెర్ఫామెన్స్‌తో కూడా మెప్పించింది.

ఈ సినిమా ఒరిజినల్‌ వర్షన్‌కి చేంజెస్‌ ఉన్నాయా?

– ఒరిజినల్‌ వెర్షన్‌లో ట్యూన్స్‌ ఒక్కటి కూడా వాడలేదు. అన్నీ కొత్త ట్యూన్స్‌. కేవలం సాంగ్స్‌ మాత్రమే కాదు, సినిమాలో సీన్స్‌ కూడా ఒరిజినల్‌ నుంచి ఓ 15 మాత్రమే తీసుకున్నాం. మిగతా సీన్స్‌ అన్నీ మేం కొత్తగా రాసుకున్నాం. సినిమా సోల్‌ మాత్రమే తీసుకున్నాం. మలయాళం వెర్షన్‌లో హీరోయిన్‌, విలన్‌ పాత్రలు లేవు. తెలుగులో పెట్టాం. ఒరిజినల్‌ సినిమా చూసిన వాళ్లకు కూడా మా ‘ఏబీసీడీ’ కొత్తగా కనిపిస్తుంది.

మీ ఇన్నేళ్ల నటన మీకు ఏం నేర్పింది?

– చాలానే నేర్పింది. కెమెరా అంటే ఉన్న భయాన్ని పోగొట్టింది. అలాగే చాలా మంది సీనియర్లతో పనిచేశాను. వాళ్లు ఎలా సీన్లో జీవిస్తారో తెలుసుకున్నా. ‘కొత్తజంట’ చేసేటప్పుడు సుకుమార్‌గారిని ఒకసారి డీసెంట్‌ ఆర్టిస్ట్‌ అంటే ఎవరు? అని అడిగా. అందుకు ఆయన దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు డీసెంట్‌ ఆర్టిస్ట్‌. దర్శకుడు చెప్పిందానికి, తన సొంత విషయాన్ని కలగలపి నటంచేవాడు ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పారు. ఆయన కతిసనన్ని దష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్పారు. అప్పటి నుంచి ఇంప్రవైజ్‌ చేసేవాడిని. అంతకు ముందు దర్శకుడు చెప్పింది కాకుండా ఎక్కువ ఏదైనా చేస్తే వినయం లేదనుకుంటారేమోనని అనుకునేవాడిని. కానీ సుకుమార్‌గారు చెప్పిన తర్వాత చాలా మార్చుకున్నా. నన్ను నేను స్పాంటానియస్‌గా ఇంప్రవైజ్‌ చేసుకుంది అవార్డు వేడుకల్లో హోస్ట్‌ చేస్తున్నప్పుడు. అక్కడ రీటేక్‌లుండవు. 70 శాతం స్క్రిప్ట్‌ ప్రకారమే వెళ్తాం. క్లోజ్‌, కట్‌.. వంటివి ఉండవు. అందుకే నాకు హోస్టింగ్‌ వల్లనే సమయస్ఫూర్తి వచ్చింది. ‘ఏబీసీడీ’లోనూ ఇలాంటి స్కిట్‌లు చాలా ఉన్నాయి.

ఇది పొలిటికల్‌ డ్రామానా?
– అలాంటిదేమీ కాదు. కానీ కొన్ని సన్నివేశాలు నా దగ్గరకు ఎలా వచ్చాయి, వాటి నుంచి నేను ఎలా మారాను? అనే కథలో భాగంగా కాస్త పొలిటికల్‌ డ్రామా ఉంటుంది. మన ఆడియన్స్‌కి తగ్గట్టు ఉంటుంది.

మీకు సినిమా నిర్మాణం గురించి అవగాహన ఉంది. మీరు పనిచేసే సినిమాల్లో ఇన్వాల్వ్‌ అవుతారా?
– లేదండీ. ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమాలు తీసేవారికి, సినిమాను ఎలా అమ్మాలి? ఎంతకు అమ్మాలి? వంటివన్నీ తెలుసు. అందుకే వాటిని గురించి నేను ఎప్పుడూ అడగను.

మీ బ్యానర్‌ లో నెక్ట్‌ సినిమా ఎప్పుడు?
– త్వరలోనే ఒక పెద్ద అనౌన్స్‌ మెంట్‌ తో మీ ముందుకు రాబోతున్నాము. ఒక అగ్ర దర్శకుడితో సినిమా ప్లాన్‌ చేశాం. ఇంకో నెల రోజుల్లో దాని వివరాలు తెలియ జేస్తాము. వచ్చే ఏడాదిలో 2 సినిమాలు చేయాలనుకుంటున్నాను. వీటిలో ఒక సినిమా స్క్రిప్ట్‌ ఆల్రెడీ లాక్‌ అయింది. ఇదొక మంచి లవ్‌ స్టోరీ అంటూ.. ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ హీరో అల్లు శిరీష్‌