ముంబైకి ప్రభాస్.. ‘సాహో’ షెడ్యూల్ మొదలైంది..

0
6

బాహుబలి లాంటి గ్రాండ్ హిట్ తర్వాత ఆరడుగుల అందగాడు ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంపైన బోలెడు అంచనాలున్నాయి. బాహుబలి సినిమా రిలీజ్ సమయంలోనే ‘సాహో’ ట్రైలర్ చూసి అందరూ షాక్ అయ్యారు. షేడ్స్ అఫ్ సాహో పేరుతో రిలీజ్ అయిన రెండు మేకింగ్ వీడియోలు హాలీవుడ్ స్థాయిలో ఉండి అంచనాలు మరింత పెంచేసాయి . అందుకు తగ్గట్టే దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో సాహో నిర్మాణం అవుతోంది. యువ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను హాలీవుడ్ స్టైల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పుడు తాజా షెడ్యూల్ ను ‘సాహో’ టీం ముంబైలో ప్రారంభించబోతోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ఇక్కడ ప్రభాస్ ఎలాంటి పోరాటాలు చేయనున్నారని ఆసక్తిగా మారింది.. తాజా షెడ్యూల్ ఎన్నిరోజులనేది వేచిచూడాలి. ముంబైలోని ప్రధాన చోట్లలో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. కాగా ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ కు తోడుగా ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలితో దేశవ్యాప్తంగా మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ కు ఇప్పుడు ‘సాహో’తో మరింత క్రేజ్ దక్కడం ఖాయమని.. సినిమా అంచనాలకు మించి ఉంటుందని తెలుస్తోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here