సినిమాలు వేరు.. హీరోలు ఒక్కటే..

0
7

నాని నటించిన ‘జెర్సీ’విడుదలైంది. గత రెండు చిత్రాలు అటూ ఇటూ ఆడిన వేళ నాని చూపు అంతా ఈ సినిమాపైనే.. ‘జెర్సీ’ ఏమవుతుందా అని.. టెన్షన్ టెన్షన్.. ఈ సినిమా కోసం నాని పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. క్రికెట్ కోచ్ ను పెట్టుకొని మరీ ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకున్నాడు. నెట్స్ లో కష్టపడ్డాడు. తన నేచురాలిటీ.. అనుభవాన్ని అంతా రంగరించి ‘జెర్సీ’లోని అర్జున్ పాత్రకు ప్రాణం పోశాడు. నాని కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు థియేటర్స్ లో అది ప్రతిఫలించింది. జెర్సీ సూపర్ టాక్ ని సొంతం చేసుకుంది .జెర్సీ లో నేచురల్ స్టార్ యాక్టింగ్ కు ఫిదా అవ్వని వారుండరు. విమర్శకుల ప్రశంసలు అందుకునేలా నాని నటించాడని కొనియాడుతున్నారు..

టాలీవుడ్ లో హీరోలు ఎవరికి వారే పోటీ.. కానీ అది సినిమాల పరంగానే.. అదీ హెల్దీ పోటీనే అని మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు నాని సక్సెస్ ను టాలీవుడ్ హీరోలు కూడా సెలబ్రేట్ చేసుకుంటు తమ సహచర హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమా చూసిన ఎన్టీఆర్ నాని నటనకు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లోనే బెస్ట్ యాక్టర్లలో ఒకరైన ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసకు నాని కూడా రియాక్ట్ అయ్యారు.. ‘బాబాయ్ థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ కూడా స్పందించాడు. అద్భుతమైన గుండెను హత్తుకునే ఫిల్మ్ జెర్సీ. నాని నటన అద్భుతంగా ఉంది. కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని కొనియాడారు . జెర్సీ యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇక మంచు మనోజ్ తదితర హీరోలు కూడా నానికి శుభాకాంక్షలు చెప్పారు.

ఇలా టాలీవుడ్ లో ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఒక హీరో సినిమాను మరో హీరో ప్రశంసించడం.. బాగుందని కితాబివ్వడం అందరినీ ఆనందానికి గురిచేస్తోంది. ఇలా మన హీరోల ఐక్యత అభిమానులకు కూడా కన్నుల పండువగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here