గడ్డం పెంచండి.. హిట్ కొట్టండి!

0
15

ఒకప్పుడు తెలుగు సినిమా హీరోలు గడ్డంతో కనిపించేవారు కాదు. వాళ్ళకు మీసాలు తప్పనిసరిగా ఉండాలి. గడ్డం నున్నగా గీసుకొని ఉండాలి. ఏదో తప్పనిసరిగా గడ్డంతో నటించాల్సిన సీన్లు ఉంటే అప్పుడు పెట్టుడు గడ్డంతో బండి లాగించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. గడ్డం రియల్ గా పెంచుతున్నారు. ఈమధ్య కాలంలో హిట్స్ ను పరిశీలిస్తే గడ్డం అనేది ఒక హిట్ సెంటిమెంట్ గా మారిపోయినట్టు అనిపిస్తోంది.

‘రంగస్థలం’ సినిమాకు ముందు చరణ్ కు ‘ధృవ’ లాంటి హిట్ ఉన్నప్పటికీ అది మెగా పవర్ స్టార్ రేంజ్ హిట్ కాదు. యాభై కోట్ల క్లబ్ అనేది లేనప్పుడే ‘మగధీర’ తో 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చరణ్ మళ్ళీ ‘రంగస్థలం’ తో ఆ రేంజ్ విజయం సాధించాడు. నాన్-బాహుబలి రికార్డులను తిరగరాసి మెగా పవర్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలో చరణ్ పొడవాటి గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే.

F2 సినిమాతో విక్టరీ వెంకటేష్ మాత్రమే కాకుండా వరుణ్ తేజ్ కూడా కెరీర్ బెస్ట్ హిట్ సాధించాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ లైట్ గా గడ్డంతో కనిపించాడు. ఈ సినిమాకు ముందు వరుణ్ నటించిన ‘అంతరిక్షం’ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచినా ‘F2’ మాత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

ఏప్రిల్ 5 న నాగ చైతన్య ‘మజిలీ’ రిలీజ్ అయింది. ఈ సినిమాలో మొదటి సారి చైతూ ఫుల్ గా పెంచిన గడ్డంతో కనిపించాడు. ఈ సినిమాలో కాలేజీ కుర్రాడిగా క్లీన్ షేవ్ లుక్ కూడా ఉన్నప్పటికీ ప్రేమలో ఫెయిల్ అయిన వ్యక్తిగా చైతు అందరినీ మెప్పించడమే కాదు కెరీర్ బెస్ట్ హిట్ సాధించాడు. ఈ సినిమాకు ముందు సినిమాలు నిరాశ పరిచినా ‘మజిలీ’ తో కమర్షియల్ హిట్ మాత్రమే కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు.

సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన ‘చిత్రలహరి’ ఏప్రిల్ 12 న రిలీజ్ అయింది. వరస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న తేజుకు ఈ సినిమా విజయం ఎంతో రిలీఫ్ ను ఇచ్చింది. ఈ సినిమాలో తేజు పొడవాటి గడ్డంతో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే.

తాజాగా న్యాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని రెండు లుక్స్ లో కనిపించాడు. ‘మజిలీ’ లో నాగ చైతన్య లాగానే క్లీన్ షేవ్ లుక్ తో పాటుగా గడ్డం లుక్ లో తనకు మాత్రమే సాధ్యమైన సహజ నటనతో అందరినీ కట్టిపడేశాడు. సినిమా సూపర్ హిట్ అని యునానిమస్ టాక్ వచ్చేసింది.

అలా అని గడ్డం పెంచుకుంటే చాలు.. కథా కథనాలు అవసరం లేదు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో హీరోలు గడ్డం లుక్ లో ఉన్నప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఇది టాలీవుడ్ లో పాజిటివ్ సెంటిమెంట్ గా మారిందేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here