‘హుషారు’ సినిమాను ప్రేక్షకులే నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లారు – డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి

0
196

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్‌ నిర్మాతగా శ్రీహర్ష కొనుగంటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు’. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొంది డిసెంబర్‌ 14న చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించి ఫిబ్రవరి 1తో 50 రోజులను పూర్తి చేసుకోనున్న సందర్భంగా దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఇంటర్వ్యూ.

హుషారు సక్సెస్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?
– ఈ సినిమా చేసేటప్పుడే మా టార్గెట్‌ ఆడియెన్స్‌ యూత్‌. మా టార్గెట్‌ను పూర్తిగా రీచ్‌ అయ్యామనే అనుకుంటున్నాం. మా సినిమాకు కనెక్ట్‌ అయ్యి ఎక్కువ సార్లు చూసినవాళ్లు చాలా మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో సినిమా గురించి యూత్‌ పాజిటివ్‌గా రెస్పాన్స్‌ అయ్యారు. 50 రోజులను రీచ్‌ కావడం కష్టంగా మారిన ఇలాంటి రోజుల్లో మా ‘హుషారు’ సినిమా ఫిబ్రవరి 1న 50 రోజులను పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆ రోజున గ్రాండ్‌ఈవెంట్‌ నిర్వహించి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌కు వెళ్లి ప్రేక్షకులను కలవబోతున్నాం.

ఈ సినిమా బేసిక్‌ ఐడియా ఏంటి?
– ఈ సినిమాకు బేసిక్‌ ఐడియా ఏంటంటే.. పాతికేళ్లు వయసులో ఉద్యోగం లేకపోతే యూత్‌ ఎలా బ్రతుకుతారు? అనేదే. ఈ జనరేషన్‌ అలాంటిది కుదురుతుందా? లేదా? అనేది ఈ సినిమాలో చూపించాం

థియేటర్‌లో సినిమా చూశారు కదా? ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉంది?
– సినిమా చూసిన ప్రేక్షకుల్లో .. సినిమాలో నాలుగు క్యారెక్టర్స్‌లో ఏదో ఒక క్యారెక్టర్‌కు కనెక్ట్‌ అవుతున్నారు. నేను కనపడినప్పుడు నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. వారు సినిమాకు ఎలా కనెక్ట్‌ అయ్యామనే విషయాన్ని చెబుతున్నారు. ప్రేక్షకులే సినిమాను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది.

ఇండస్ట్రీ నుండి ఎలాంటి అప్రిసియేషన్‌ వచ్చింది?
– ఇండస్ట్రీ నుండి చాలామంది సినిమా చూసి అప్రిషియేట్‌ చేశారు. మా సినిమా పెద్దసినిమాలతో పాటు రిలీజ్‌అయ్యి విజయవంతంగా ముందుకు రావడంతో సినిమాలో కంటెంట్‌ ఉందని అందరూ మెచ్చుకున్నారు. చాలా మంది సోషల్‌ మీడియాలో మెచ్చుకున్నారు.

ఉండి పోరాదే సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది కదా! ఆ సాంగ్‌ ఐడియా ఎవరిది?
– ‘ఉండిపోరాదే..’ సాంగ్‌కు ముందు వేరే ఆలోచన ఉండేది. అయితే కథానుగుణంగా హీరో.. హీరోయిన్‌కు సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకుంటాడు. అందులో భాగంగా యు.ఎస్‌ వెళ్లాలనుకున్న హీరోయిన్‌తో హీరో మనం ఇక్కడే ఉండిపోదాం. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పడమనే ఉద్దేశానికి రధన్‌గారు అద్భుతమైన ట్యూన్‌ ఇచ్చారు. సిద్‌శ్రీరాం ఆ ట్యూన్‌కు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చి పాటను నెక్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు. ఈ సాంగ్‌కు శాడ్‌ వెర్షన్‌ కూడా చాలా పెద్ద హిట్టయ్యింది.

ఈ పాట గురించి అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు కదా! ఎలా ఫీల్‌ అయ్యారు?
– ఈ పాట చాలా బావుందని అల్లు అర్జున్‌గారు కూడా ట్వీట్‌ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అల్లు అర్జున్‌ మా సినిమా చూడడంతో పాటు పాట బాగుంది అని ట్విట్‌ చేయడం కూడా సినిమాకు మంచి ప్లస్‌ అయ్యింది.

ఈ సినిమాను రీమేక్‌ చేసే ఆలోచన ఉందా?
– ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. సినిమాలో కొంత భాగాన్ని రీషూట్‌ చేసి తమిళ్‌,హిందిలో రిలీజ్‌ చేస్తున్నారు.

ఫ్యూచర్‌లో ఎలాంటి మూవీస్‌ చేయాలనుకుంటున్నారు?
– ఇప్పుడు ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడం కష్టమవుతుంది. వాళ్లకి కొత్తపాయింట్‌ అనిపిస్తేనే థియేటర్‌కు వస్తున్నారు. జనాలకు నచ్చే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తోనే మూవీస్‌ చేయాలి అనుకుంటున్నాను.

మీ నెక్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– పెద్ద బ్యానర్స్‌లో రెండు సినిమాలకు కథ రెడీ చేస్తున్నాను. ఇందులో ఒక సబ్జెక్ట్‌ ఫుల్‌ పాజిటివ్‌గా ఉండి క్లీన్‌ యు సర్టిఫికేట్‌ మూవీ, మంచిఇన్‌స్పిరేషనల్‌ మూవీ అవుతుంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here