అంతరిక్షం’ వంటి సినిమా చేయడం నటుడిగా నాకొక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ – వరుణ్‌ తేజ్‌

0
436

‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్‌’, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’..
ఇలా.. డిఫరెంట్‌ సబ్జెక్ట్‌లను సెలెక్ట్‌ చేసుకుంటూ సూపర్‌హిట్స్‌ సాధిస్తూ.. ఆడియన్స్‌లో, మెగా ఫ్యాన్స్‌లో తనకంటూ హీరోగా ఓ స్పెషల్‌ ఐడెంటిటీని సంపాదించుకున్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. రీసెంట్‌గా వరుణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో క్రిష్‌ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అంతరిక్షం 9000’. ఈ చిత్రం డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా ‘ఇండస్ట్రీ హిట్‌’ ఇంటర్వ్యూ.

తొలిసారి ‘అంతరిక్షం’ వంటి డిఫరెంట్‌ చిత్రం చేయడం ఎలా అన్పించింది?
– ‘అంతరిక్షం’ వంటి సినిమా చేయడం నటుడిగా నాకొక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. ఇంతకు ముందు సినిమాలంటే ఎక్కడో ఎవరో చేసిన క్యారెక్టర్‌ను బేస్‌గా తీసుకునే చాన్స్‌ ఉండేది. ఈ సినిమా విషయానికి వస్తే అస్ట్రానాయిడ్‌ రోల్‌ అంటే తెలుగులో ఎక్కడా రెఫరెన్స్‌ పాయింట్‌ కూడా లేదు. హాలీవుడ్‌ సినిమాల నుండి రెఫరెన్స్‌ తీసుకున్నాను. ఈ సినిమా ప్రారంభానికి ముందు గ్రావిటీ, ఇంటర్‌ స్టెల్లర్‌ సినిమాలను చూశాను. ఈ జర్నీ దాదాపు రెండేళ్ల క్రితం మొదలైంది. ఘాజి తర్వాత సంకల్ప్‌ నన్ను కలిశాడు. తను ఏ కథ చెబుతాడనేది నాకు అప్పుడు ఐడియా లేదు. బ్యాగ్‌లో నుండి ల్యాప్‌టాప్‌, మూడు నాలుగు శాటిలైట్‌ బొమ్మలు తీసి.. తన ఐడియా చెప్పి, ఇస్రో బ్యాక్‌డ్రాప్‌లో మన నెటివిటీతో చేద్దామనుకుంటున్నానని చెప్పాడు. సాధారణంగా కొత్త కథలతో సినిమాలు చేయాలనుకునే నాకు తన ఐడియా చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళ్ళారా?
– సంకల్ప్‌ ఐడియా చెప్పిన తర్వాత స్క్రిప్ట్‌ను డెవలప్‌ చేయడానికి చాలా సమయం పట్టింది. తను ఇస్రోలో పనిచేసిన ఎక్స్‌ సైంటిస్ట్‌లను కలిసి వివరాలను సేకరించి స్క్రిప్ట్‌ రాసుకున్నాడు.

కాస్ట్యూమ్స్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
– స్పేస్‌లో టెంపరేచర్‌లో చాలా తక్కువగా ఉంటుంది. మైనస్‌ డిగ్రీల్లో ఉంటుంది. అందువల్ల అస్ట్రానాయిడ్స్‌ డిఫరెంట్‌గా దుస్తులను ధరిస్తారనే సంగతి తెలిసిందే. వాళ్లు వాడే మెటీరియల్‌ కాకుండా అలాగే ఉండేటట్లు ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మోనిక డ్రెస్‌ డిజైన్‌ చేశారు. ఆ డ్రెస్‌ బరువు 15-20 కిలోల వరకు ఉండేది. ఆ డ్రెస్‌ వేసుకోవాలంటే పదిహేను నిమిషాల సమయం పట్టేది.

స్పేస్‌ మూవీ అనగానే హాలీవుడ్‌తో పోలుస్తారు కదా?
– హాలీవుడ్‌ స్పేస్‌ మూవీస్‌ అంటే వందల కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తారు. కానీ మా బడ్జెట్‌ లిమిటేషన్స్‌ మాకున్నాయి. కుదిరినంత వరకు బెస్ట్‌ ఔట్‌పుట్‌ ఇచ్చాం. గ్రాఫిక్స్‌తో పాటు ఎమోషన్స్‌ కూడా మా సినిమా డ్రైవ్‌ చేశాయి.

ఈ చిత్రానికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు?
– రోప్స్‌ కట్టుకున్నప్పుడు వెయిట్‌ వల్ల పెయిన్‌ వస్తుంది. అయితే ఆ ప్రెజర్‌ ముఖంలో తెలియనీయకూడదు. అందుకని సినిమా స్టార్ట్‌ కావడానికి మూడు వారాల ముందుగానే ట్రయినింగ్‌ తీసుకున్నాం. బల్గేరియా నుండి వచ్చిన యాక్షన్‌ టీం మమ్మల్ని ట్రెయిన్‌ చేసింది. మూడు రోజులు కాస్త కష్టంగానే అనిపించినా.. తర్వాత అలవాటైంది.

తక్కువ టైమ్‌లో జీరో గ్రావిటిని ఎలా క్రియేట్‌ చేశారు?
– హాలీవుడ్‌ సినిమాల్లో జీరో గ్రావిటీ సీన్స్‌ చేయాలంటే పెద్ద పెద్ద మిషన్స్‌ ఉంటాయి. వాటి సహకారంతో సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. అయితే మన సినిమా విషయానికి వస్తే.. సాహో, థగ్స్‌ ఆఫ్‌ ఇండియా సినిమాలకు పనిచేసిన స్పెషల్‌ వి.ఎఫ్‌.ఎక్స్‌ టీం ముంభై నుండి వచ్చింది. వాళ్లు మా సైజ్‌కు తగ్గట్లు రిగ్స్‌ను తయారు చేశారు. రోప్స్‌ ఉపయోగించి చేశాం. ప్రీ ప్రొడక్షన్‌లో వీటిని ముందుగానే ప్లాన్‌ చేసుకుంటూ రావడంతో ఇంత పెద్ద మూవీని 70-80 డేస్‌లో పూర్తి చేశాం.

దేవ్‌ పాత్ర గురించి?
– ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. దేవ్‌ అనే ఓ అస్ట్రానాయిడ్‌ ఇండియా పేరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ఏం చేయాలనే తపనతో ఉంటాడనేదే కథ. చాలా సినిమాల్లో చూసిన కథే అయినా, స్పేస్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేయడం వల్ల డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్‌ అంటూ ఎవరూ లేరు. సినిమాలో సైంటిస్ట్‌లకు ఓ సమస్య వస్తుంది. దాన్ని ఎలా సాల్వ్‌ చేస్తారనేది సినిమాలో కథాంశం.

ఇటువంటి చిత్రాలకు బి, సి సెంటర్లలో ఆదరణ ఎలా ఉంటుంది?
– బి, సి సెంటర్స్‌ ప్రేక్షకులు అని ప్రేక్షకులను డివైడ్‌ చేసి చెప్పడమేంటో నాకు అర్థం కాదు. అన్ని సందర్భాల్లో ప్రేక్షకులు సాంగ్స్‌, ఫైట్స్‌ ఉండాలని ఎక్స్‌పెక్ట్‌ చేయరు. నేను ఇప్పుడు చేస్తున్న ఎఫ్‌2 సినిమాలో సాంగ్‌, ఫైట్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. ఉదాహరణకు చాలా ఇంగ్లీష్‌ సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యి పెద్ద విజయాన్ని సాధించాయి. వరల్డ్‌ సినిమాల ఎక్స్‌పోజర్‌ తక్కువగా ఉండే ప్రేక్షకులు ఉంటారేమో కానీ.. వాళ్లకి కూడా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుందని నా నమ్మకం.

డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు?
– నేను ఎక్స్‌పెరిమెంట్‌ మూవీస్‌ను చేయడం లేదు. నా సినిమాల్లో ఓ కొత్త పాయింట్‌ ఉండాలనుకుంటున్నాను. అలాగే కొత్తగా ప్రెజంట్‌ చేయాలనుకుంటున్నానంతే.

నిర్మాతలు క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాణ విలువల గురించి?
– రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌లతో కంచె తర్వాత నేను చేసిన రెండో చిత్రమిది. సాధారణంగా మార్కెట్‌ ఉండే హీరో బడ్జెట్‌కి తగినట్టు ఓ కమర్షియల్‌ సినిమాను చేసుకుని లాభం సంపాదించుకోవచ్చు. కానీ తను అలా కాదు. అన్నీ బ్యానర్‌ సినిమాల్లా ఉండకూడదని డిఫరెంట్‌ సినిమాలను ఫ్యాషన్‌తో చేస్తున్నారు. ఇలాంటి నిర్మాతలతో చేయడం నా అదృష్టం.

‘ఎఫ్‌2’ చిత్రం గురించి చెప్పండి?
– వెంకటేష్‌గారి వంటి ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న నటుడితో ‘ఎఫ్‌2’ చిత్రంలో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మాస్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమాలో నటన పరంగా నాకెంతో హెల్ప్‌ చేశారు. ఈ సినిమాతో వెంకటేష్‌గారు మా ఫ్యామిలీతో పాటు నాకూ మంచి ఫ్రెండ్‌ అయ్యారు. సినిమా మొత్తం హిలేరియస్‌ కామెడీ ఉంటుంది. సంక్రాంతికి ‘ఎఫ్‌2’ రిలీజవుతుంది.

నెక్స్‌ట్‌ చేయబోయే చిత్రాలు?
– గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ చేస్తున్నాను. ఇందులో బాక్సర్‌గా కనపడతాను. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేయబోతున్నా. హరీశ్‌ శంకర్‌ తో ‘జిగర్‌ తండా’ రీమేక్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here