ప్రస్తుతం కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ సమయంలో తమ ఇంట్లోని వారికి మనం కూడా ఎంతో కొంత పనుల్లో సాయపడాలని టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ చేసిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ప్రస్తుతం టాలీవుడ్ తారలు ఒకరి నుండి మరొకరి వద్దకు చేరుతూ వేగవంతంగా కొనసాగుతోంది. నేడు సక్సెస్ఫుల్ గా తన ఛాలెంజ్ ని పూర్తి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, దానిని తన బాబాయి బాలకృష్ణ, చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, , దర్శకుడు కొరటాల శివ లకు విసరగా, కాసేపటి క్రితం కొరటాల శివ, ఎన్టీఆర్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.
అనంతరం కొద్ది సమయం వ్యవధిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను, కాకపోతే మీ పార్టనర్ రామ్ చరణ్ వీడియో కోసం కూడా ఎదురుచూస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి, ఛాలెంజ్ సినిమాలో విలన్ రావు గోపాలరావు తో ఛాలెంజ్ చేసే వీడియో బైట్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. కాగా ఈ ఛాలెంజ్ మున్ముందు ఇంకెంత సక్సెస్ఫుల్ గా ఎవరెవరు నటులకు చేరుతుందో చూడాలని పలువురు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు…..!!
Challenge accepted @tarak9999 .. అలాగే your partner in crime @AlwaysRamCharan #betherealman వీడియో కోసం వెయిటింగ్… I am waiting https://t.co/hdiNd8ARKV pic.twitter.com/T7PM2Sgpck
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2020



