కారంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ సంయుక్త సమర్పణలో సుజాయ్, సుశీల్ దర్శకత్వంలో సాయిరోనిక్, ప్రీతి అస్రాణి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రజర్ కుక్కర్’ ప్రతి ఇంట్ల ఇదే లొల్లి.. అనేది టాగ్ లైన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని ఈ రోజు (జూన్ 15) రామానాయుడు స్టూడియోస్‌లో స్టార్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు విడుదలచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
స్టార్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు మాట్లాడుతూ – ”ఈ చిత్ర దర్శకుడు సుజాయ్‌ని ఈ మధ్యనే కలిశాను. యూఎస్‌లో ఉంటున్నప్పటికీ సినిమా మీద ప్యాషన్‌తో ఈ సినిమాని చాలా క్లారిటీగా తెరకెక్కించారు. ఆయన సోదరుడు సుశీల్ అతనికి కావాల్సినంత సహాయం చేశారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో చాలా డిటైల్డ్‌గా ఎంతో క్లారిటీతో చెప్పడం జరిగింది. చిత్ర యూనిట్, ప్రొడ్యూసర్ అప్పారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా రిలీజ్ లోపు ప్రజల్లోకి తీసుకుపోవడానికి పబ్లిసిటీ విషయంలో కూడా ప్రొడ్యూసర్స్ దగ్గర చాలా మంచి ప్లాన్ ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను” అన్నారు.
దర్శకుడు సుజాయ్ మాట్లాడుతూ – ” రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నాం. మేం చెప్పాలనుకున్న సందేశాన్ని ఈ సినిమాలో కచ్చితంగా చెప్పగలిగాము. ఇది కిషోర్ అనే బిటెక్ కుర్రాడి కథ. తండ్రిని హ్యాపీగా ఉంచడానికి ఎలాగైనా అమెరికా వెళ్ళాలి.. అనుకునే కిషోర్ ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నాడు అనేదానికి కొంచెం కామెడిగా, విమర్షణాత్మకంగా చూపించడం జరిగింది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ జనరేషన్ కురాళ్ళ, అమ్మాయిలు తప్పకుండా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది. మా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేరిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి కృతజ్ఞతలు” అన్నారు.
దర్శకుడు సుశీల్ మాట్లాడుతూ – ”యూఎస్‌లో నేను అన్నయ్య ఎలాంటి ప్రజర్ భరించామో ఈ సినిమాలో చూపించాం. అలాగే ఇండియాలో ఉండి కూడా మంచి జీవితం గడపొచ్చు అనే సందేశం కూడా ఉంది. సినిమా మేకింగ్ చాలా హ్యాపీగా జరిగింది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది’ అన్నారు.
చిత్ర నిర్మాత ఎ.అప్పారెడ్డి మాట్లాడుతూ – ”మా సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి థాంక్స్. దర్శకుడు సుజాయ్ ద్వారా నేను ప్రొడ్యూసర్ అయ్యాను. చిన్నప్పటి నుండి అమెరికాలో ఉన్నాకూడా మన సినిమా ఎలా ఉంటుందో తెలుసు. ఈ చిత్రాన్ని దర్శకులు ‘సెటిల్ అవ్వాలనుకుంటే అమెరికా లోనే కాదు.. ఇండియాలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి’ అనే సందేశంతో తెరకెక్కించారు” అన్నారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ – ”సురేష్ బాబు గారు చెప్పినట్టు సుజాయ్ ముందు నుండి చాలా క్లారిటీతో ఉన్నాడు. ఎలాంటి అనుభవం లేకున్నా ఒక కాన్సెప్ట్ అనుకోని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి రీసర్చ్ చేసి ఈ కథను ఓకే చేశారు. అలాగే ఆర్టిస్ట్‌లు, టెక్నిషియన్స్ ఎంపికలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా ఎలా ఉంటుంది అనే దానిపై నాకు ముందే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది” అన్నారు.
హీరో సాయి రోనిక్ మాట్లాడుతూ – ” మధుర శ్రీధర్ గారే నన్ను సుజాయ్‌కి పరిచయం చేశారు. మంచి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది. నేటి తరం యువత అమెరికా వెళ్ళాలి అనే ప్రెజర్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. రిలీజ్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ – “జోష్ సినిమాతో ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించి ఎన్నో హిట్ సాంగ్స్ పాడాను. అయితే ఇప్పుడు ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమాలో రెండు పాటలు నేను కంపోజ్ చేయడం జరిగింది. అందులో ఒకటి పక్కా హైదెరాబాదీ సాంగ్ ” అన్నారు.
హీరోయిన్ ప్రీతీ అస్రాణి మాట్లాడుతూ – ”చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. హీరోయిన్ అవ్వాలనేది నా డ్రీమ్. ఈ సినిమా ద్వారా అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి కతజ్ఞతలు” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పోస్ట్ – ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సాయి కృష్ణ గద్వాల్, సినిమాటోగ్రాఫర్ నగేష్ బానెల్, ఎడిటర్ నరేష్ రెడ్డి జొన్న, డిఐ శరత్, పబ్లిసిటీ డిజైనర్ అనంత్ కంచెర్ల తదితరులు పాల్గొన్నారు.
సాయి రోనిక్, ప్రీతీ అస్రాణి, తనికెళ్ళ భరణి, సంగీత, రాహుల్ రామకృష్ణ, రాజయిరోవన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లిరిక్స్ : సిరాశ్రీ, రాహుల్ సిప్లిగంజ్, పబ్లిసిటీడిజైనర్ : అనంత్ కంచర్ల( పద్మశ్రీ ఆర్ట్స్), పోస్ట్ – ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : సాయి కృష్ణ గద్వాల్, ఆర్ట్ డైరెక్టర్ : జె కె మూర్తి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : హర్ష వర్ధన్ రామేశ్వర్, సంగీతం : సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, సినిమాటోగ్రఫీ : నగేష్ బనెల్, అనిత్ మదాడి, ఎడిటర్ : నరేష్ రెడ్డి జొన్న, ప్రొడ్యూసర్స్ : సుజాయ్, సుశీల్ మరియు ఎ. అప్పారెడ్డి. కథ, దర్శకత్వం – సుజాయ్,సుశీల్.


